పని మధ్యలో ఆపితే నిద్ర పట్టదు... 'ఝుమ్మంది నాదం' తాప్సీ
"ఝుమ్మంది నాదం" చిత్రంతో పరిచయమైన తాప్సీ తెలివిగా తన గురించి తాను పబ్లిసిటీ చేసుకుంటోంది. తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.."ఒక పని మొదలు పెడితే మధ్యలో ఆపడం నాకు నచ్చదు. అది పూర్తయ్యే వరకు సరిగా నిద్ర కూడా పట్టదు. అలా ఏ పని ప్రారంభించినా నిర్విఘ్నంగా పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాను అంటూ చెప్పుకొచ్చింది. అంటే తను పని పట్ల ఎంత శ్రధ్దగా ఉంటాననేది ఇన్ డైరక్ట్ గా దర్శక, నిర్మాతలుకు చెప్పుతోందన్నమాట. అలాగే...తాప్సి అయితే ఈ పాత్రకు బావుంటుంది..తనైతేనే బాగా చేయగలదు అని దర్శకనిర్మాతలు పూర్తిగా నమ్మాలి. అప్పుడే నేను పాత్రలో పరకాయ ప్రవేశం చేయగలను" అంటోంది. అంటే దర్శకుడు తనను పూర్తిగా నమ్మాలి అని వివరిస్తోంది. ప్రస్తుతం మంచు విష్ణు సరసన ఓ చిత్రంలో నటిస్తున్న తాప్సీ...ప్రభాస్ సరసన నటించే చిత్రంలో బికినీ ధరిస్తుంది. అలాగే రవితేజ సరసన చేయటానికి కూడా కమిటైంది.


Click it and Unblock the Notifications











