ముని 3: లారెన్స్‌తో తాప్సి రొమాన్స్...
హైదరాబాద్: 'కాంచన' వంటి సూపర్ డూపర్ హిట్ తర్వాత మళ్లీ దర్శకుడు రాఘవ లారెన్స్, నిర్మాత బెల్లంకొండ సురేష్ కాంబినేషన్లో 'ముని-3' భారీ చిత్రం రాబోతోంది. లారెన్స్ దర్శకత్వం వహిస్తూ హీరోగా నటించే 'ముని-3'లో తాప్సీ హీరోయిన్ గా నటిస్తుంది.
మల్టీ డైమన్షన్ ఎంటర్ టైన్మెంట్ ప్రై.లిమిటెడ్ సమర్పణలో శ్రీ సాయి గణేష్ ప్రొడక్షన్స్ ప్రై.లిమిటెడ్ పతాకంపై బెల్లంకొండ సురేష్, బెల్లంకొండ గణేష్ బాబు నిర్మించే 'ముని-3' షూటింగ్ ముహూర్తం డిసెంబర్ నిర్వహించనున్నారు. జనవరి నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. మిగిలిన నటీనటుల ఎంపిక జరుగాల్సి ఉంది.
ఈ సందర్భంగా నిర్మాత బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ...'కాంచన లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మా బేనర్లో లారెన్స్ తో చేస్తున్న 'ముని-3' సబ్జెక్ట్ ఎక్స్ ట్రార్డినరీగా ఉంది. హీరోగా, దర్శకుడిగా లారెన్స్ ముని-3 మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నారు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన అన్ని వివరాలూ తెలియజేస్తాను' అన్నారు.
రాఘవ లెరెన్స్, తాప్సీ జంటగా నటిస్తున్న ఈ భారీ చిత్రానికి ఫోటోగ్రఫీ: కిచ్చా, సంగీతం: విజయ్ ఆంథోని, సమర్పణ: మల్టీ డైమన్షన్ ఎంటర్ టైన్మెంట్స్, నిర్మాతలు: బెల్లంకొండ సురేష్, బెల్లకొండ గణేష్ బాబు, కథ-స్క్రీన్ ప్లే-కొరియోగ్రఫీ-దర్శకత్వం: రాఘవ లారెన్స్.


Click it and Unblock the Notifications











