హీరో రాజశేఖర్ ఇష్యూలో నోరు విప్పిన తారా చౌదరి, ఏం జరిగిందంటే..?
Recommended Video

హీరో రాజశేఖర్ మీద గతంలో రకరకాల రూమర్స్ వినిపించాయి. ముఖ్యంగా పలు వివాదాలతో వార్తల్లో నిలిచిన నటి తారా చౌదరికి, అతడికి సంబంధం ఉందనే వార్తలు అప్పట్లో హాట్ టాపిక్ అయ్యాయి. ఈ విషయంలో ఓసారి రాజశేఖర్ కూడా వివరణ ఇచ్చారు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో తారా చౌదరి స్పందించారు. రాజశేఖర్ ఇష్యూలో ఆమె తన వాదన వినిపించారు. గతంలో ఆయన తను ఉంటున్న ప్లాటు దగ్గరకు వచ్చిన మాట నిజమే కానీ... అందుకు కారణం వరే అని తెలిపారు.

షూటింగులో తొలిసారి ఆయన్ను కలిశాను
నేను సినీ ఇండస్ట్రీకి రాకముందే ఆయన నటించిన ‘మా అన్నయ్య' అనే సినిమా చూశాను. ఆ మూవీలో అన్నయ్య సెంటిమెంట్ చాలా నచ్చింది. నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత ఒక షూటింగ్ జరుగుతుండగా రాజశేఖర్ గారిని మీట్ అయ్యాను, మీరంటే నాకు అభిమానం, మీ సినిమా మా అన్నయ్య చూశాను, నాకు బాగా నచ్చింది అని చెప్పడంతో ఆయన చాలా హ్యాపీగా ఫీలయ్యారు.

శ్రీనగర్ కాలనీలో ఫ్లాటు వద్దకు
ఆ తర్వాత ఒక సందర్భంలో శ్రీనగర్ కాలనీలో నేనుంటున్న ఫ్లాట్ పక్కన ఒక ఫ్లాట్ ఖాళీ అయితే రాజశేఖర్, జీవిత వచ్చి చూశారు. అది స్పేస్ సరిపోదు అని చెప్పి తీసుకోలేదు. ఆ విషయం వారు నాతో స్వయంగా చెప్పారు.

అలాంటి సంబంధం లేదు
అలా కొన్ని సందర్భాల్లో ముఖ పరిచయమే తప్ప నా విషయంలో రాజశేఖర్ గారి మీద వచ్చే రూమర్స్ అన్నీ అబద్దం. ఆయన చాలా మంచి వ్యక్తి, జీవిత కూడా మంచిది. బయట రకరకాలుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. అందులో నిజం లేదు.

రాజశేఖర్‌తో దిగిన ఫోటోతో బ్లేమ్ చేశారు
రాజశేఖర్, జీవిత ఎప్పుడు ఎదురు పడ్డా... చాలా బాగా మాట్లాడతారు. వారితో కలిసి ఫోటో కూడా దిగాను. ఆ ఫోటో చూసి నన్ను రకరకాలుగా బ్లేమ్ చేశారు. వాళ్లను కూడా బెదిరించినట్లు నాకు తెలిసింది అని తారా చౌదరి చెప్పుకొచ్చారు.
హీరో ప్రభాస్, ఎన్టీఆర్, దిల్ రాజుకు ఛాలెంజ్!

నా వద్ద డబ్బు ఉందనేది అంతా అబద్దం
నా వద్ద చాలా డబ్బు ఉందని ప్రచారం జరుగుతోంది. అందులో ఏ మాత్రం నిజం లేదు. నేను సినిమాలు తీయడానికి కొందరు స్నేహితులు సహాయం చేస్తున్నారు. ఒక ఆడపిల్ల సినిమా రంగంలోకి వచ్చినపుడు ఇలాంటి సహజమే అని తారా చౌదరి తెలిపారు.
సమంతకు తెగనచ్చేసింది... చైతూకు సపోర్టు చేస్తూ ట్వీట్!


Click it and Unblock the Notifications











