తారా చౌదరి నటించిన సినిమాలు కొన్ని

ఇక తారా చౌదిరికి తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి పరిచయాలే ఉన్నాయని తెలుస్తోంది. ఆమెకు పరిశ్రమలోని చాలా మంది పెద్దలతో పరిచయాలు ఉన్నాయని, అయితే అవన్నీ సినిమా పరమైన ప్రొఫెషనల్ పరిచయాలే కావచ్చునని అంటున్నారు. ఇప్పుడు వారిలో చాలామంది ఈ కేసు ఎటు తిరిగి తమ మీదకు వస్తుందో అని భయపడుతున్నారు. ఆమె తో పర్శనల్ గా పోన్ లో కాంటాక్ట్ లో ఉన్నవారు అయితే చాలా కంగారుపడుతున్నారు. ఆమె సెల్ లో నెంబర్స్ ద్వారా తమను పోలీసులు కలిస్తే ఎలా టాకిల్ చెయ్యాలనే విషయంపై మధన పడుతున్నారు.
అలాగే ఇప్పుడు ఏ ఇద్దరు సినిమా వాళ్ళు కలిసినా ఓ కొత్త సినిమా గురించి మాట్లాడుకుంటున్నట్లు తారా చౌదరి గురించి మాట్లాడుకుంటున్నారు. దీనికి తోడు ఒక చిన్న నిర్మాత రూ.3 లక్షల అప్పు తీర్చకపోవడంతో, తనతో పరిచయం ఉన్న ఇద్దరు పోలీసు అధికారులను రంగంలోకి దించినట్లు తెలిసినట్లు వార్తలు వచ్చాయి. ఆ చిన్న నిర్మాత ఎవరు అని అందరూ ఎంక్వైరీలు చేసుకుంటున్నారు. అంతేగాక ఆమెతో ఓ పోలీస్ యాక్షన్ పాత్రలు కంటిన్యూగా వేసే ఓ హీరోతో సంబందం ఉందని మీడియాలో వచ్చింది. దాంతో ఆ హీరో ఎవరనేది ఒక్కొక్కరూ ఒక్కో రకంగా మాట్లాడుకుంటున్నారు.
ఏదైమైనా తారా చౌదిరి లాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలని, తర్వాత బ్లాక్ మెయిలింగ్ కి దిగిందని భాదపడి,టెన్షన్ పడితే లాభం లేదని సినిమా పరిశ్రమలో ఉండే కొంతమందికి ఇదో గుణపాఠం గా అబివర్ణిస్తున్నారు. ఆమెను అడ్డం పెట్టుకుని అప్పటికప్పుడు తమ పనులు చేయించుకున్నవాళ్లు ఇలా సమస్య రాగానే కంగారు పడి ఫలితం లేదని బహిరంగంగానే విమర్శిస్తున్నారు. అయినా సినీ పరిశ్రమలో నెలకొకటైనా ఇలాంటి వ్యభిచార కేసు బయిటపడటం కూడా అందరినీ ఆలోచనలో పడేస్తోంది.


Click it and Unblock the Notifications











