పెళ్లి కాకముందే.. బావ మోసం చేశాడని కేసు పెట్టిన తార చౌదరి!

సినీనటి తారా చౌదరి గతంలో అనేక వివాదాల్లో చిక్కుకుంది. సెక్స్ రాకెట్ నడిపిందనే అభియోగాలు ఆమెపై ఉన్నాయి. పలువురు సినీ రాజకీయ ప్రముఖులతో తనకు సంబంధాల ఉన్నట్లు చెప్పిన తారా చౌదరి వారి పేర్లు మాత్రం బయట పెట్టలేదు. ఈ కేసు వ్యవహారాలు సద్దుమణిగాక తారా చౌదరి తన జీవితాన్ని తాను సాగిస్తోంది. మరోమారు తారా చౌదరి పోలీసు కేసు వ్యవహారంతో వార్తల్లోకి ఎక్కింది. ఇది పూర్తిగా తారా చౌదరి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయం. తనకు బావ వరసయ్యే వ్యక్తి ఒకరు మోసం చేశాడని తారా చౌదరి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.

 పెళ్లి చేసుకోవాలని కోరుతూ

పెళ్లి చేసుకోవాలని కోరుతూ

తారా చౌదరికి, రాజ్ కుమార్ అనే వ్యక్తి బావ వరుస అవుతాడు. రాజ్ కుమార్ సోదరి సుజాత, తారా చౌదరికి బాగా సన్నిహితంగా ఉంటారు. ఈ నేపథ్యంలో తన సోదరుడిని వివాహం చేసుకోవాలని సుజాత పలు సందర్భాల్లో తారపై ఒత్తిడి తెచ్చింది. కానీ తార మాత్రం అతడిని వివాహం చేసుకోవడానికి అంతగా ఆసక్తి చూపలేదు. అప్పటికే రాజ్ కుమార్ ఓ మహిళని వివాహం చేసుకుని ఉన్నాడు. ఈ విషయాన్ని తార సుజాత వద్ద ప్రశ్నించగా.. విడాకులు తీసుకుని చాలా రోజులు గడిచిందని చెప్పింది.

వివాహం కాకముందే

వివాహం కాకముందే

తార చౌదరి రాజ్ ముఖ పట్ల అయిష్టంగానే ఉన్నప్పటికీ తెలిసిన వారు కావడంతో ఆలోచనలో పడింది. ఈ క్రమంలో తారా చౌదరి విజయవాడకు తన నివాసాన్ని మార్చింది. అక్కడికి కూడా రాజ్ కుమార్ వెళ్ళాడు. పెళ్లి కాక ముందే అక్కడున్న ఇరుగు పొరుగువారికి తాను తార భర్తగా పరిచయం చేసుకున్నాడు. వీరిద్దరూ భార్య భర్తలని అంతా విశ్వసించడం మొదలు పెట్టారు. ఈ తరుణంలో తార, రాజ్ కుమార్ ని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది.

 కథ అడ్డం తిరిగింది

కథ అడ్డం తిరిగింది

తార చౌదరి ఇటీవల రాజ్ కుమార్ వద్ద పెళ్లి ప్రస్తావన తీసుకుని వచ్చింది. కానీ అతడు తప్పించుకు తిరగడం ప్రారంభించాడు. దీనితో అతడు మోసం చేశాడని గ్రహించిన తార బంజారా హిల్స్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదు చేసింది. తన బావే నమ్మించి మోసం చేసాడని తార ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

సెక్స్ రాకెట్ కేసులో

సెక్స్ రాకెట్ కేసులో

గతంలో తార చౌదరి సెక్స్ రాకెట్ కేసు ఎలాంటి దుమారం రేపిందో అందిరికి తెలిసిందే. అప్పట్లో తారా చౌదరి వివాదం మీడియాలో హాట్ టాపిక్ గా ఉండేది. చాలా మంది ప్రముఖులు తమతో గడిపేందుకు రావాలని ఫోన్ చేసి బెదిరించేవారని తారా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేసింది. వాళ్లంతా పెద్ద వాళ్ళు కావడంతో పేర్లు బయటపెట్టలేక పోతున్నానని తారా సెక్స్ రాకెట్ కేసు వివాదంలో పేర్కొన్న సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X