పెళ్లి కాకుండానే భార్యాభర్తల్లా.. అతడితో తార చౌదరి సహజీవనం!
సినీనటి, వివాదాస్పద తారాచౌదరి మరోమారు వార్తల్లో నిలిచింది. తారాచౌదరి బావని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనని నమ్మించి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడని తారా చౌదరి ఇటీవల తన బావపై బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఎట్టకేలకు పోలీసులు తార చౌదరికి బావ వరసయ్యే రాజ్ కుమార్ ని అదుపులోకి తీసుకున్నారు. సెక్స్ రాకెట్, సినీరాజకీయ ప్రముఖులతో సంబంధాలు ఇలా పలు వివాదాల్లో చిక్కుకున్న తారా చౌదరి తన బావ మూలంగా మరోమారు వార్తల్లోకెక్కింది.

పెళ్లి చేసుకుంటానని చెప్పి
2016లో తారా చౌదరి బావ రాజ్ కుమార్, అతడి సోదరి సుజాత ఆమె ఇంటికి వచ్చారు. నిన్ను పెళ్లి చేసుకుంటానని తార చౌదరికి చెప్పాడు. నీకు ఆల్రెడీ పెళ్లి అయిందిగా.. మళ్ళీ ఇప్పుడు పెళ్లి ఏంటి అని రాజ్ కుమార్ ని ప్రశ్నించింది. దీనితో సుజాత కలగజేసుకుని మొదటి భార్యకు విడాకులు ఇస్తాడని చెప్పింది. ఆ తరువాత తార చౌదరికి మాయమాటలు చెప్పి ఆమెని లోబరుచుకున్నారు. అప్పటి నుంచి తార చౌదరి అతడితో సహజీవనం చేయడం ప్రారంభించింది.

సోదరితో కలసి కుట్ర
తార పూర్తిగా వారిని నమ్మిన తరువాత రాజ్ కుమార్, సుజాత కలసి ఆమె ఆస్తులపై కన్నేశారు. విజయవాడకు మకాం మార్చిన తరువాత అక్కడున్నవారందరికి తాను తార చౌదరి భర్త అని చెప్పుకోవడం ప్రారంభించాడు. తనకు అప్పులు ఉన్నాయని డబ్బు కావాలని తార చౌదరిని వేధించడం ప్రారంభించాడు.దీనితో వీరి మధ్య గొడవలు పెరిగి దూరం కూడా పెరిగింది.

పెళ్లి కాకుండానే
దీనితో ఈ నెల 10న తార చౌదరి తన బావపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. మేమిద్దరం పెళ్లి కాకుండానే భార్యాభర్తల్లా రెండేళ్లు కలసి ఉన్నాం. ఇప్పుడు డబ్బు ఇవ్వలేదని మోసం చేసి వెళ్ళిపోయాడు. నా జీవితం నాశనం అయింది అంటూ తార ఫిర్యాదు చేసింది.

ప్రతిరోజు పోలీస్ స్టేషన్‌కు
ఫిర్యాదు చేసిన తరువాత తార చౌదరి ప్రతిరోజు పోలీస్ స్టేషన్ కు వెళ్లి పోలీసులపై ఒత్తిడి పెంచింది. రాజ్ కుమార్ ని ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదు అని నిలదీసింది. దీనితో ఆమె కేసు కోసం పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. గుంటూరులో ఉన్న నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.


Click it and Unblock the Notifications











