For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

‘సినిమా చూశాక ఓటు వేయండి, అసలైన వారసుడు జూ ఎన్టీఆర్ మాత్రమే’

|
RGV Interesting Tweet On Jr NTR And TDP Goes Viral | Filmibeat Telugu

'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రాన్ని ఏపీలో విడుదల కానివ్వకుండా అడ్డుకోవడంతో రామ్ గోపాల్ వర్మ తన ప్రతాపాన్ని ట్వీట్ల రూపంలో చూపెడుతున్నారు. సినిమా అక్కడ విడుదలైతే ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే కొందరు ఇదంతా చేస్తున్నారంటూ ఆయన ఆరోపణలు గుప్పిస్తున్నారు.

తాజాగా ఆర్జీవీ తన ట్వీట్లో జూ ఎన్టీఆర్ ప్రస్తావన తేవడం ద్వారా ఎన్టీ రామారావు అభిమానులను, ఆయన స్థాపించిన తెలుగు దేశం పార్టీ అభిమానించే వారిని ఆలోచనలో పడేశారు. వారు వర్మ చేసిన ట్వీట్ ఫాలో అయితే ఓటింగ్ సరళిలో మార్పు వచ్చే అవకాశం ఉందని కొందరి వాదన.

ఓటు వేసే ముందు సినిమా చూడండి

ఓటు వేసే ముందు సినిమా చూడండి

ఎన్టీ రామారావు, జూ ఎన్టీఆర్ రియల్ అభిమానులు అందరూ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా చూసిన తర్వాతే మీ ఓటు హక్కు వినియోగించుకోవాలని రామ్ గోపాల్ వర్మ సూచించారు. ఇలాంటి ప్రకటనచేయడం ద్వారా ఓటింగులో మార్పు తెచ్చే ప్రయత్నం బలంగా చేస్తున్నట్లు స్పష్టమవుతోంది.

అసలైన వారసుడు జూ ఎన్టీఆర్ మాత్రమే

‘లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాలో సిబిఎన్‌ను చూసిన తర్వాత నారా లోకేష్ తెలుగు దేశం పార్టీకి నిజమైన వారసుడు కాదని మీకు అర్థమవుతుంది. అసలైన వారసుడు జూ ఎన్టీఆర్ మాత్రమే. అతడే భవిష్యత్‌లో తెలుగు దేశం పార్టీకి వారసుడు... అని రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యానించారు.

కంపుకు దూరంగా ఎన్టీఆర్, రాంచరణ్‌... RRR పేరుతో రాజమౌళి భలే తప్పించారు!

ఎన్నికల్లో ఓడిపోవాలని శపించిన వర్మ

ఎన్నికల్లో ఓడిపోవాలని శపించిన వర్మ

సినిమా కోసం పుట్టి, సినిమా మూలంగా సీఎం అయిన మహానాయకుడు ఎలా సీఎం పదవి పోగొట్టుకున్నాడో అనే సినిమా చూడకుండా ఆపుతున్న తెర వెనక ఉన్న వెన్నుపోటు డైరెక్టర్‌కి నాలాంటి కోట్ల ఎన్టీఆర్ అభిమానులందరం కమండలం‌లో నీళ్లు తీసి శపిస్తున్నాం.. ఈ ఎన్నికలలో ఓటమి ప్రాప్తించుగాక .. తధాస్తు... అంటూ వర్మ ఇప్పటికే శపించిన సంగతి తెలిసిందే.

లక్ష్మీస్ ఎన్టీఆర్

లక్ష్మీస్ ఎన్టీఆర్

ఎన్టీ రామారావు జీవితంలోకి లక్ష్మీ పార్వతి ఎంటరైన తర్వాత జరిగిన పరిణామాలను ప్రధానంగా ఫోకస్ చేస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. రామారావును వెన్నుపోటు పొడిచి పదవి నుంచి ఎలా తప్పించారు? ఈ వెన్నుపోటులో భాగమైన వ్యక్తులు ఎవరు? అనేది ఈ చిత్రంలో చూపించారు.

అద్భుతమైన రెస్పాన్స్

అద్భుతమైన రెస్పాన్స్

లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విడుదల కానప్పటికీ... తెలంగాణతో పాటు ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లో విడుదలైంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారంతా ఇతర ప్రాంతాలకు వెళ్లి సినిమా చూస్తున్నారు. అన్ని చోట్లా ఈ చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.

ఎన్టీ రామారావు జీవిత చరిత్ర

ఎన్టీ రామారావు జీవిత చరిత్ర

ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రలో థియేటర్ ఆర్టిస్ట్ విజయ్ కుమార్, లక్ష్మీ పార్వతి పాత్రలో కన్నడ నటి యజ్ఞశెట్టి, చంద్రబాబు నాయుడు పాత్రలో శ్రీతేజ్ నటించారు. రామ్ గోపాల్ వర్మ, అగస్త్య మంజు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రాకేష్ రెడ్డి, దీప్తి బాలగిరి నిర్మించారు.

English summary
"All truly real and realistic honest fans of NTR and tarak9999 should cast their vote only after seeing ncbn in #LakshmisNTR ..naralokesh is a false heir to jaiTDP and only true heir is the fantastic tarak9999 who should be the only true honest future of TDP." RGV tweeted.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more