జూ ఎన్టీఆర్ ని అడ్డంపెట్టి ఎదగాలని ఆమె
తారక్ ఎక్సట్రీమ్ లీ టాలెంటెంటెడ్.మా అమ్మ అంటే ఆయనకు చాలా గౌరవం.దమ్ము షూటింగ్ లో ఆయనతో కలిసిపనిచేయటం చాలా అదృష్టంగా భావిస్తున్నాను అంటూ ఎన్టీఆర్ ని పొగడ్తల్లో ముంచేస్తోంది కార్తిక.జూ.ఎన్టీఆర్ తాజా చిత్రం దమ్ము లో సెకెండ్ హీరోయిన్ గా రాధిక కూతురు కార్తికను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.ప్రస్తుతం హైదరాబాద్ అవుట్ స్కట్స్ లో జరుగుతున్న ఈ చిత్రం షూటింగ్ లో పాల్గొంటున్న ఆమె మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించింది.అలాగే ఆమె ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తోంది.ఎన్టీఆర్ ద్వారా తెలుగులో మరిన్ని చిత్రాలు పట్టుకోవాలని అనుకుంటోంది.ఎన్టీఆర్ ఇక్కడ టాప్ స్టార్ కాబట్టి అతని ద్వారా ఆమె ఎక్సపోజ్ అయ్యితే మరిన్ని ఆఫర్స్ వస్తాయని నమ్ముతోంది.అందుకే ఇలా ఎన్టీఆర్ పై పొగడ్తల వర్షం కురిపిస్తోంది.
ఇక ఇప్పుడు ఎన్టీఆర్ ఎక్కడ మాట్లాడినా 'దమ్ము"ప్రసక్తి తెస్తున్నారు.ఆ చిత్రం ఫ్యాన్స్ కి విందు భోజనంలా ఉంటుందని అని పని గట్టుకుని మరీ చెప్తున్నారు. అలాగే తాను లావు తగ్గి చేసే డాన్స్ లు హైలెట్ గా ఉంటాయని నొక్కి మరీ చెపున్నారు. భవిష్యత్ లో తాను లావు గా కనపడనని, గతంలో కనపించినంత లావుగా కానని,తగ్గిపోతానని,ఆ విషయం దమ్ము చిత్రం లో గమనించవచ్చునని ఎన్టీఆర్ తన అభిమానులకు హామీ ఇచ్చారు. అలాగే జూ. ఎన్టీఆర్ ఇక తన దృష్టినంతా తాజా చిత్రం 'దమ్ము"పై కేంద్రీకరిస్తున్నాడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కె.యస్.రామారావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
బాలకృష్ణతో గత సంవత్సరం 'సింహా"లాంటి విజయవంతమైన చిత్రాన్ని అందించిన తర్వాత బోయపాటి శ్రీను చేస్తోన్న ఈ చిత్రం పట్ల ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. పక్కా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా బోయపాటి శ్రీను తనదైన శైలిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడని చెప్తున్నారు. అలాగే ఈ చిత్రానికి 'దమ్ము" అనే టైటిల్‌ని త్వరలో అధికారికంగా ఖరారు చేయనున్నట్లు తెలిసింది.ఈ విషయాన్ని ఎన్టీఆర్ మీడియా సమావేశంలో ధృవీకరించారు.మార్చిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.ఈ చిత్రానికి యం.యం.కీరవాణి సంగీతాన్నందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











