జూ ఎన్టీఆర్... పాలిటిక్స్, సినిమా గురించి తేల్చేసిన మంచు మనోజ్!
హైదరాబాద్ నుంచి తాత్కాలికంగా తిరుపతికి షిప్టయిన మంచు మనోజ్ రాయలసీమ కేంద్రంగా సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. అక్కడి యువతకు సహాయం చేస్తూ యువనేతగా ఎదిగేందుకు మంచు మనోజ్ ప్రయత్నాలు చేస్తున్నారు. మరో వారం రోజుల్లో తను చేయబోయే కార్యక్రమాల గురించి మంచు మనోజ్ ప్రకటించబోతున్నారు.
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ యంగ్ స్టార్ అభిమానులు అడిగే ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చారు. ఈ సందర్భంగా కొందరు అభిమానులు తన ఫ్రెండ్ ఎన్టీఆర్ గురించి, సినిమా, రాజకీయ ప్రయాణం గురించి ప్రశ్నించారు.
ఎన్టీఆర్ నా ప్రాణం
మంచు మనోజ్ అభిమాని ఒకరు... తారక్ భయ్యా గురించి ఒక్క మాటలో చెప్పాలని కోరగా ‘నా ప్రాణం' అంటూ సమాధానం ఇచ్చారు.
నెక్ట్స్ స్టెప్ సినిమాలా? రాజకీయాలా?
మీ తర్వాతి స్టెప్ రాజకీయాలా? సినిమాలా? అనే అంశం గురించి ఓ అభిమాని ప్రశ్నించగా.... ‘అఫ్ కోర్స్ సినిమాలే' అంటూ రిప్లై ఇచ్చారు.
లవ్ యూ బ్లడ్
ఈ సందర్భంగా మనోజ్ ఓ ట్వీట్లో తన అభిమానులను తన రక్త సంబంధీకులుగా పేర్కొంటూ ట్వీట్ చేశారు. లవ్ యూ ఆల్ అంటూ వారిపై తన ప్రేమను వ్యక్త పరిచారు.
స్నేహితులతో కలిసి సరదాగా
మనోజ్ ఇటీవల శింబు, ఆది పనిశెట్టి, మరికొందరు స్నేహితులతో కలిసి వీకెండ్ సరదాగా గడిపారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడిస్తూ మనోజ్ ఓ వీడియో పోస్టు చేశారు.


Click it and Unblock the Notifications











