ఓ మై గాడ్ జూ ఎన్టీఆర్ తోనా...రాజమౌళి క్లారిఫికేషన్
రాజమౌళి ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న మర్యాదరామన్న చిత్రంలో జూ ఎన్టీఆర్ గెస్ట్ గా చేస్తాడని,ఓ పాట,ఫైట్ ఉంటుందని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే వాటిని ట్విట్టర్ లో రాజమౌళి కొట్టిపారేశారు. ఆయన ఈ విషయమై క్లారిఫై ఇస్తూ...ఓ మై గాడ్..ఎలాంటి రూమర్స్ వస్తున్నాయో...నో!!! తారక్..మర్యాదరామన్న చిత్రంలో గెస్ట్ గా చేయటం లేదు అన్నారు. ఇక త్వరలో రిలీజ్ కానున్న మర్యాదరామన్న చిత్రం మార్కెట్లో మంచి క్రేజ్ తెచ్చుకుని మార్కెట్ అవుతోంది. సునీల్, సలోని కాంబినేషన్ లో రెడీ అయిన ఈ చిత్రానికి పాటలు కీరవాణి అందించారు. మొన్న ఆదివారం పాటలు విడుదలై మంచి టాక్ తెచ్చుకున్నాయి. అలాగే ప్రోమో లు కూడా అంతటా క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్నాయి. అంతా ఈ చిత్రం సూపర్ హిట్ అవుతుందని భావిస్తున్నారు.
మర్యాద రామన్న జూ ఎన్టీఆర్ సునీల్ సలోని కీరవాణి వేదం jr ntr vedam keeravani rajamouli sunil saloni maryada ramanna


Click it and Unblock the Notifications