Don't Miss!
- News ఓటర్లను బెదిరించిన డీకేపై ఎఫ్ఐఆర్, అయ్యా అలా అనలేదని హైకోర్టులో పిటిషన్, అపార్ట్ మెంట్ లో ?
- Lifestyle May Day 2024 Wishes : శ్రామికులు లేనిదే అభివృద్ధి లేదు.. శ్రామికుల దినోత్సవ శుభాకాంక్షలు
- Finance Gold Rate: పిచ్చెక్కిస్తున్న పసిడి ధరలు.. నేడు మళ్లీ పెరుగుదల.. రూ.4,900 అప్..
- Sports ధోనీకి కోపం వచ్చింది.. భయపడిన కెమెరామెన్ Video
- Automobiles 'కావ్య మారన్' ఖరీదైన కార్లు ఇవే! ఇక్కడ చూడండి
- Technology Nokia 225 4G 2024 మోడల్ ధర, స్పెసిఫికేషన్లు మరియు డిజైన్ లీక్! వివరాలు
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
నడిరోడ్డుపై మోకాళ్ళతో ఎన్టీఆర్ డ్యాన్స్
"మా హీరో ఎన్టీఆర్.. నడిరోడ్డుపై మోకాళ్ళతో చేసిన డ్యాన్సులకు విజిల్స్, క్లాప్స్ మోగాల్సిందే" అంటున్నారు నిర్మాతలు. అయితే వాళ్లు చెప్పే హీరో జూనియర్ ఎన్టీఆర్ కాదు, ఎన్టీఆర్ గా పేరు మార్చుకున్న తారకరత్న గురించి. తారకరత్న తాజా చిత్రం నందిశ్వరుడు త్వరలో విడుదల కాబోతున్న సందర్భంగా తమను కలిసిన మీడియాతో నిర్మాతలు ఇలా స్పందించారు - "అలాగే.. మా 'నందీశ్వరుడు' ట్రైలర్స్, ఇంటర్వెల్ బ్లాగ్ చూసి రాజమౌళి క్లాప్స్ కొట్టారు. ప్రతి ఒక్కరూ కసితో చేసిన చిత్రమిది. విజయాన్ని మాత్రమే కాంక్షిస్తూ పాటుపడ్డాం. దానికి తగ్గ ప్రతిఫలం అందుతుందన్న నమ్మకం ఉంది". అలాగే కథ గురించి చెపుతూ... "కన్నడ 'డెడ్లీ సోమా'ను ఆధారంగా చేసుకుని 'నందీశ్వరుడు' కథను అల్లుకున్నాం. ఉన్నత కుటుంబంలో పుట్టిన వ్యక్తి తల్లి ఆశయం కోసం సిటీకి వెళ్తాడు. అక్కడ అనుకోని సంఘటనల్లో ఇరుక్కుని డాన్‌గా మారుతాడు. ఆ తర్వాత ఏమైంది? అనేది కథ. హీరో పేరు నందు".
"శివుడికి నందీశ్వరుడు ఎలా కాపలా కాస్తాడో, సమాజానికి మా నందీశ్వరుడు కూడా అలాంటివాడే. టైటిల్ కథకి చక్కగా సరిపోతుంది. సెంటిమెంట్, రొమాన్స్, యాక్షన్, మెసేజ్... అన్నీ ఉన్న సినిమా. రచన మౌర్య ఓ ప్రత్యేక గీతంలో ఆడిపాడింది. ఎక్కడా అశ్లీలత ఉండదు" అన్నారు. "ఇక హీరో తారకరత్న కసితో పనిచేశారు. ఆరడుగుల అందంతో మంచి ఇమేజ్‌తో దూసుకుపోయారు. గొప్పగా సహకరించారు. డ్యాన్సులు, యాక్షన్... ఒకటేంటి అన్ని యాంగిల్స్‌లోనూ మెప్పించారు. జగపతిబాబు గెస్ట్ రోల్ కాదు. ఆద్యంతం ఉంటారాయన. పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తారు. ఇద్దరి మధ్య యాక్షన్, వాగ్వివాదం ఎక్స్ట్రార్డినరీగా సాగుతుంది. షీనా తన పరిధిలో శభాష్ అనిపించుకుంటుంది" అని చెప్పుకొచ్చారు.
ఈ చిత్రానికి రచన: పరుచూరి బ్రదర్స్, ఫొటోగ్రఫీ: సుధాకరరెడ్డి, సంగీతం: పార్థు, ఎడిటింగ్: కృష్ణారెడ్డి, ఫెట్స్: థ్రిల్లర్ మంజు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: యువరాజ్.