ప్లాన్ మారింది: ఎన్టీఆర్ బయోపిక్‌లో యంగ్ టైగర్ నటించడం లేదు, కానీ...
తెలుగు ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం దివంగత నటుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్. వచ్చే ఏడాది సంక్రాంతికి రెండు భాగాలుగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Recommended Video

ఇందులో బాలయ్య... లీడ్ రోల్ చేస్తుండగా, రానా, కళ్యాణ్ రామ్, విద్యా బాలన్, రకుల్ ప్రీత్ లాంటి వారు కీలకమైన పాత్రలో కనిపించబోతున్నారు. అయితే ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతున్నా అఫీషియల్‌గా ఎలాంటి సమాచారం లేదు.

ప్లాన్ మారింది, నటించడం లేదు
ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ తన తండ్రి హరికృష్ణ పాత్ర పోషిస్తుంగా.... జూ ఎన్టీఆర్ యంగ్ బాలయ్యగా కనిపిస్తారని ప్రచారం జరిగింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం యంగ్ టైగర్ పాత్ర విషయంలో ప్లాన్ మారినట్లు తెలుస్తోంది.

వాయిస్ ఓవర్?
ఈ బయోపిక్‌లో జూ ఎన్టీఆర్ ఎలాంటి పాత్ర చేయడం లేదని, ఇందులో ఆయన వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్న విషయం వెలుగులోకి వచ్చింది. సినిమా ప్రారంభంలో ఎన్టీ రామారావు నేపథ్యాన్ని వివరిస్తూ యంగ్ టైగర్ వాయిస్ ఓవర్ అద్బుతంగా ఉండతోతోందట.

పాత్ర కంటే ఇదే గొప్పగా ఉంటుంది
యంగ్ బాలయ్యగా జూ ఎన్టీఆర్ నటించడం కంటే.... తాతయ్య నేపథ్యం వివరాస్తూ వాయిస్ ఓవర్ ఇవ్వడమే గొప్పగా ఉంటుందనే అభిప్రాయాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. తాతయ్య గురించి మనవడు వాయిస్ ఓవర్ చెప్పడం సినిమాపై మంచి ఇంపాక్ట్ చూపుతుందని టాక్.

రెండు భాగాలుగా
ఈ బయోపిక్ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ‘కథానాయకుడు' పేరుతో వచ్చే మొదటి భాగంలో ఎన్టీ రామారావు బాల్యం, సినీ రంగ ప్రవేశం, నెం.1 స్టార్‌గా ఎదిగిన వైనాన్ని చూపించబోతున్నారు. రెండో భాగం ‘మహానాయకుడు' పేరుతో తెరకెక్కుతోంది. ఇందులో ఎన్టీఆర్ రాజకీయాల వైపు రావడం, పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారం చేపట్టడం లాంటివి చూపించబోతున్నారు.


Click it and Unblock the Notifications











