Don't Miss!
- News త్వరలో గురు-శుక్ర సంయోగం.. ఈ రాశులవారికి పట్టిందల్లా బంగారం
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్‌లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ఫ్యామిలీని ఎదురించిన నందమూరి హీరో.... ఐదేళ్లు పూర్తి, ఫోటో అదుర్స్!
తారకరత్న ఐదేళ్ల వైవాహిక జీవితాన్ని పూర్తి చేసుకున్నారు.2012లో ఆయన అలేఖ్య రెడ్డిని ప్రేమ వివాహం చేసుకున్నారు.
పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకోవడం సాహసం కాకపోతే మరేమిటి? ఓ వైపు రాజకీయాల పరంగా, సినిమా రంగం పరంగా బాగా పేరు ప్రతిష్టలు ఉన్న నందమూరి ఫ్యామిలీ, మరో వైపు తనను ప్రేమించి అమ్మాయిని నట్టేటవిడిచి పెట్టలేని పరిస్థితి.
తన ప్రేమకు కుటుంబ సభ్యుల నుండి అభ్యంతరాలు రావడంతో తారక రత్న పెద్ద సాహసం చేయక తప్ప లేదు. కట్ చేస్తే హైదరాబాద్ శివారులోని సంఘీ టెంపుల్లో ప్రేమించిన అమ్మాయితో తారకరత్న రహస్యం వివాహం. ఈ సంఘటన జరిగి ఆగస్టు నెలతో సరిగ్గా ఐదేళ్ల పూర్తయింది.
అందమైన నందమూరి జంట
ఆగస్టు 2తో తమ వైవాహిక బంధానికి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా తారకరత్న-అలేఖ్య ఓ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇపుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటో చూసిన ప్రతి నందమూరి అభిమాని జంట చూటముచ్చటగా ఉందని అనకుండా ఉండలేక పోతున్నారు.
Recommended Video
సినీ పక్కిలో వివాహం
ఘనమైన సినీ రంగ నేపథ్యం ఉన్న ఫ్యామిలీ నుండి వచ్చిన తారకరత్న వివాహం సినీఫక్కీలోనే జరుగడం విశేషం. ఆ మధ్య ఓసారి టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తారకరత్న తన ప్రేమ కథను రివీల్ చేశాడు.
అలా పరిచయం
ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా అలేఖ్య రెడ్డితో తారకరత్నకు పరిచయం ఏర్పడింది. అలేఖ్య సిస్టర్‌కు కాలేజ్‌లో తారక్ సీనియర్. చెన్నైలో మొదలైన వీరి ప్రేమకథ హైదరాబాద్ వరకూ ప్రయాణించింది. తారక్ సినిమాల్లో కొచ్చిన తర్వాత అలేఖ్య ఓ సినిమాకు కాస్ట్యూమ్స్ కూడా స్వయంగా డిజైన్ చేశారు.
మొదటి ప్రపోజల్
ఈ ఇద్దరిలో తారక్ మొదట లవ్ ప్రపోజల్ తెచ్చాడట. తల్లిదండ్రులతో మాట్లాడమని అలేఖ్య రెడ్డి చెప్పింది. ఇంట్లో పెద్దవాళ్లు ఒప్పుకోకపోవడంతో సంఘీ టెంపుల్లో వీరిద్దరూ ఒక్కటయ్యారు.
ఎవరీ అలేఖ్య రెడ్డి?
అనంతపురం జిల్లాకు చెందిన మాజీ రావాణశాఖ ఉద్యోగి కుమార్తె అలేఖ్యా రెడ్డి. తారక్ గతంలో నటించిన నందీశ్వరుడు సినిమాకి అలేఖ్యా కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేశారు.
తారకరత్న
అలేఖ్య రెడ్డికి అల్రెడీ పెళ్లయి విడాకులు అయ్యాయి. ఆ తర్వాతే తారకరత్న ఆమెను ప్రేమించి పెళ్లాడినట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి. అయినా ఈ కాలంలో ఇలాంటి సాధారణమే.
ఫ్యామిలీ కూల్
వీరి వివాహాన్ని తొలుత ఫ్యామిలీ అంగీకరించక పోయినా తర్వాత కలిసిపోయారు. ఇలాంటి సందర్భాల్లో పెద్దలు క్షణికావేశంలో పంతాలకు పోతారు కానీ తర్వాత వారి పరిస్థితి అర్థం చేసుకుని కలిసి పోతారు. తారకరత్న-అలేఖ్య విషయంలోనూ అలానే జరిగింది.
బాలయ్యకు కూడా క్లోజ్
తారకరత్న, అలేఖ్య ఇద్దరూ బాలయ్యకు చాలా క్లోజ్. నందమూరి ఫ్యామిలీలో ఇదర కుటుంబ సభ్యులు కూడా వీరి ప్రేమ వివాహాన్ని క్రమక్రమంగా యాక్సెప్టు చేశారని తెలుస్తోంది.
విలన్ పాత్రల్లో
తారకరత్న మొదట హీరోగా ట్రైచేశాడు. అయితే సక్సెస్ రేటు లేక పోవడంతో తర్వాత విలన్ గా కూడా ట్రై చేశారు. ఛాలెంజింగ్ పాత్రలు వస్తే చేయడానికి తారకరత్న సిద్ధంగా ఉన్నారు.