‘ప్రజాపతి’గా రానున్న నందమూరి తారకరత్న..!
సిల్వర్ స్ర్కీన్ పై హీరోగా హిట్టు కొట్టడంలో తడబడినా స్టార్ క్రికెట్ మ్యాచ్ లో భారీగా హిట్టింగ్ చేసి అందర్నీ ఆకర్షించిన నందమూరి తారకరత్న ఆమధ్య'అమరావతి"లో నెగెటివ్ రోల్ ప్లే చేసి పరిణతి చెందిన నటనతో నంది అవార్డుని గెలుచుకున్న విషయం విదితమే. అదే ఉత్సాహంతో, కొత్త ఉత్తేజంతో ఇప్పుడు హీరోగా తన సెకండ్ ఇన్సింగ్స్ కి శ్రీకారం చుట్టబోతున్నాడు తారకరత్న. అదీ అలాంటిలాంటి సినిమాతో కాదండోయ్..ఓ భారీ పీరియాడికల్ ఫిల్మ్ తో..!
శ్రీ సాంబశివ క్రియేషన్స్ పతాకంపై యలమంచి రవిచంద్ నిర్మాతగా రాజా చంద్రవర్మ కథ, మాటలు, స్ర్కీన్ ప్లే, దర్శకత్వంతో తెరకెక్కనున్న ఈ చిత్రంలో తారకరత్న సరసన నలుగురు కథానాయికలు నటిస్తారట. అలాగే ప్రముఖ నటీనట తారాగణం ముఖ్య పాత్రలను పోషించనున్నారట. మరో ముఖ్య విశేషం ఏంటంటే..ఇదే కథను తొలుత నందమూరి బాలకృష్ణ తో తెరకెక్కించాలనుకున్న ఈ చిత్ర దర్శక నిర్మాతలు బాలయ్య బాబు అంగీకారంతోనూ, ఆశీస్సులతోనే ఇప్పుడీ హై బడ్జెట్ ఫిల్మ్ ని తారకరత్నతో చేయనున్నారని సమాచారం. ఏదైతేనేం..'ప్రజాపతి"గా నందమూరి కథానాయకుడే కనిపించనున్నాడన్నమాట. అన్నట్టు..ఈ భారీ పీరియాడికల్ ఫిల్మ్ కోసం ఆల్ రెడీ 'ప్రజాపతి" అనే టైటిల్ ని కూడా రిజిస్టర్ చేశారు. సో అతి తర్వలో 'ప్రజాపతి"గా తెరపైకి వచ్చే తారకరత్న కెరీర్ ఇకపై జోరుగా సాగుతుందని ఆశించవచ్చు నందమూరి అభిమానులు...


Click it and Unblock the Notifications











