నందమూరి హీరోని సోలోగానే కష్టమంటూంటే డ్యూయల్ రోల్ లోనా
నందమూరి తారకరత్న హీరోగా శ్రీ సాంబశివ క్రియేషన్స్ పతాకంపై రాజా చంద్రవర్మ దర్శకత్వంలో 'ప్రజాపతి"టైటిల్ తో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. యలమంచి రవిచంద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో తారకరత్న రెండు పాత్రలు పోషించనున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ- 'మహాశివుడి భక్తుడిగా, ధర్మపరిరక్షణలో జన సంరక్షణలో జనంకోసం బతికే నాయకుడిగా తారకరత్న ఈ చిత్రంలో సరికొత్త గెటప్స్‌లో కనిపించనున్నాడు.
ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా చక్రిని తీసుకున్నాం. త్వరలో అన్ని వివరాలు ప్రకటిస్తామ ని ఆయన తెలిపారు. వరస పరాజయాలతో దూసుకుపోతున్న తారకరత్న ఒక్కడే తెరపై రెచ్చిపోతూంటేనే జనం చూడలేకపోతున్నారు.అలాంటిది డ్యూయల్ రోల్ అంటే ఇంక ఎలా ఉంటుందని సినీ జనం కామెంట్స్ చేస్తున్నారు. కానీ తారకరత్నం మాత్రం ఈ సినిమాపై మాంచి కాన్ఫెడెన్స్ గా ఉన్నాడు. ఇక నిర్మాత యలమంచి రవిచంద్ గతంలో ఛార్మి ప్రధాన పాత్రలో మోయగాడు అనే చిత్రం నిర్మించారు.అప్పుడు ఛార్మితో గొడవ అయి ఫిల్మ్ ఛాంబర్ లో సెటిల్ చేసారు.


Click it and Unblock the Notifications











