Taraka Ratna: తారకరత్న ఆరోగ్యం విషమం.. గుండెపోటుతో పాటు మరో సమస్య.. దానివల్లే చికిత్స ఆలస్యం!

సినీ రంగంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుని.. ఇప్పుడు రాజకీయ ప్రయాణాన్ని మొదలు పెట్టాలని భావిస్తోన్నారు నందమూరి ఫ్యామిలీకి చెందిన ప్రముఖ హీరో తారకరత్న. ఆ దిశగా అడుగులు వేస్తోన్న సమయంలోనే ఆయన శుక్రవారం మధ్యాహ్నం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అప్పటి నుంచి తారకరత్న ఆరోగ్యంపై ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతోన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆయనను బెంగళూరుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా తారకరత్నం ఆరోగ్య పరిస్థితిపై ఓ తాజా అప్‌డేట్ తెలిసింది. ఆ వివరాలు మీకోసం!

లోకేష్ పాదయాత్రలో కుప్పకూలి

కుప్పంలో జరిగిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రలో తారకరత్న అస్వస్థతకు గురయ్యారు. కొద్ది దూరం నడిచిన ఆయన అకస్మాత్తుగా సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో హుటాహుటిన పార్టీ కార్యకర్తలు ఆయనను కుప్పంలోని కేసీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స తర్వాత అక్కడి నుంచి పీఈఎస్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు.

తీవ్ర గుండెపోటు 90 శాతం బ్లాక్

నందమూరి తారకరత్నకు తీవ్రమైన గుండెపోటు వచ్చినట్లు వైద్యులు తెలిపారు. అంతేకాదు, ఆయన గుండెలోని ఎడమ వైపు కవాటం 90 శాతం వరకూ బ్లాక్ అయినట్లు చెప్పారు. కానీ, బీపీ మాత్రం బాగానే ఉందని వెల్లడించారు. మొత్తానికి నందమూరి తారకరత్నకు ప్రాణాపాయం తప్పినట్లు శుక్రవారం వైద్యులు చెప్పినట్లు నందమూరి బాలకృష్ణ తెలిపారు.

బెంగళూరు వైద్యులతో చికిత్స

బెంగళూరు వైద్యులతో చికిత్స

నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రి చీఫ్‌ను సంప్రదించిన వైద్యులు.. అక్కడి నుంచి అత్యాధునిక సదుపాయాలున్న ప్రత్యేక అంబులెన్స్‌ను కుప్పం రప్పించారు. అలాగే, అందులో పలువురు కార్డియాలజిస్టులను కూడా రావాలని కోరారు. అందుకు తగ్గట్లుగానే వాళ్లు రావడంతో తారకరత్నకు చికిత్స చేయించారు.

భార్య రిక్వెస్ట్‌తో బెంగళూరుకు

కుప్పం పీఈఎస్‌ ఆసుపత్రిలో నందమూరి తారకరత్నకు వైద్యం జరుగుతోన్న సమయంలోనే ఆయన భార్య అలేఖ్యా రెడ్డి అక్కడకు చేరుకున్నారు. బెంగళూరు నుంచి వచ్చిన డాక్టర్లు పరీక్షించిన తర్వాత ఆమెతో మాట్లాడారు. అప్పుడు అలేఖ్యా రెడ్డి రిక్వెస్ట్ మేరకు నందమూరి తారకరత్న‌ను బెంగళూరులోని నారాయణ హృదయాలకు అర్ధరాత్రే తరలించారు.

కర్నాటక సీఎంకు బాబు ఫోన్

కర్నాటక సీఎంకు బాబు ఫోన్

తారకరత్నను మెరుగైన చికిత్స నిమిత్తం శుక్రవారం అర్ధరాత్రి బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పతికి తరలించారు. ఈ విషయమై కర్ణాటక సీఎం బసవరాజ్‌ బొమ్మైతో చంద్రబాబు ఫోన్లో మాట్లాడారు. తారకరత్నను తరలించే సమయంలో ట్రాఫిక్‌లో చిక్కుకుపోకుండా.. చికిత్సను మరింత మెరుగ్గా చేసేలా చూడాలని ఆయనను కోరినట్లు తెలిసింది.

ఆరోగ్యంపై తాజా సమాచారం

ఆరోగ్యంపై తాజా సమాచారం

విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతోన్న సమాచారం ప్రకారం.. ప్రస్తుతం తారకరత్నకు షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయట. అవి కంట్రోల్ అయితేనే ఆయన గుండెకు స్టంట్ వేయడం కుదురుతుందని వైద్యులు తెలిపినట్లు సమాచారం. ప్రస్తుతానికి మాత్రం షుగల్ లెవెల్స్‌ను సాధారణ స్థితికి తీసుకు వచ్చేందుకు వైద్యులు ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది.

ఎప్పటి నుంచో షుగర్.. డౌన్

నందమూరి తారకరత్నకు ఎప్పటి నుంచో షుగర్ వ్యాధి ఉన్నట్లు తెలిసింది. అయితే, నాలుగు రోజులుగా ఆయన విశ్రాంతి లేకుండా తిరుగుతుండడం, ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల ఇప్పడది తీవ్ర ఇబ్బందిగా మారింది. ఒకవేళ షుగర్ హై లెవెల్‌లో లేకపోతే కుప్పంలోని ఆస్పత్రిలోని వైద్యులే తారకరత్న గుండెకు స్టంట్ వేసేవాళ్లని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X