నందమూరి ఫ్యామిలీని ఎదిరించి... ఈ ఆయనకు స్పెషల్ డే!

By Bojja Kumar

హైదరాబాద్: పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకోవడం సాహసం కాకపోతే మరేమిటి? ఓ వైపు రాజకీయాల పరంగా, సినిమా రంగం పరంగా బాగా పేరు ప్రతిష్టలు ఉన్న నందమూరి ఫ్యామిలీ గౌరవం, మరో వైపు తనను ప్రేమించి, తనతో సహజీవనం చేస్తున్న అమ్మాయిని విడిచి పెట్టలేని పరిస్థితి.

కుటుంబ సభ్యుల నుండి మద్దతు కరువు కావడంతో తారకరత్న పెద్ద సాహసం చేయక తప్పదు. కట్ చేస్తే హైదరాబాద్ శివారుల్లోని సంఘీ టెంపుల్ లో తాను ప్రేమించిన అమ్మాయితో తారకరత్న రహస్యం వివాహం. ఈ సంఘటన జరిగి నేటికి నాలుగేళ్లు పూర్తయింది.

ఘనమైన సినీ రంగ నేపథ్యం ఉన్న ఫ్యామిలీ నుండి వచ్చిన తారకరత్న వివాహం సినీఫక్కీలోనే జరుగడం విశేషం. ఆ మధ్య ఓసారి టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తారకరత్న తన ప్రేమ కథను రివీల్ చేశాడు రూడా...

ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా అలేఖ్య రెడ్డితో తారకరత్నకు పరిచయం ఏర్పడింది. అలేఖ్య సిస్టర్‌కు కాలేజ్‌లో తారక్ సీనియర్. చెన్నైలో మొదలైన వీరి ప్రేమకథ హైదరాబాద్ వరకూ పయనించింది. తారక్ సినిమాల్లోకొచ్చిన తర్వాత అలేఖ్య ఓ సినిమాకు కాస్ట్యూమ్స్ కూడా స్వయంగా డిజైన్ చేసింది.

తారక్ మొదట లవ్ ప్రపోజల్ తెచ్చాడు. తల్లిదండ్రులతో మాట్లాడమని అలేఖ్య రెడ్డి చెప్పింది. ఇంట్లో పెద్దవాళ్లు ఒప్పుకోకపోవడంతో సంఘీ టెంపుల్‌లో వీరిద్దరూ ఒక్కటయ్యారు. స్లైడ్ షోలో మరిన్ని విశేషాలు...

ఎవరీ అలేఖ్య రెడ్డి?

ఎవరీ అలేఖ్య రెడ్డి?

అనంతపురం జిల్లాకు చెందిన మాజీ రావాణశాఖ ఉద్యోగి కుమార్తె అలేఖ్యా రెడ్డి. తారక్ గతంలో నటించిన నందీశ్వరుడు సినిమాకి అలేఖ్యా కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేసింది.

తారకరత్న

తారకరత్న

అలేఖ్య రెడ్డికి అల్రెడీ పెళ్లయి విడాకులు అయ్యాయి. ఆ తర్వాతే తారకరత్న ఆమెను ప్రేమించి పెళ్లాడినట్లు అప్పట్లో టాక్.

ఫ్యామిలీతో..

ఫ్యామిలీతో..

వీరి వివాహాన్ని తొలుత ఫ్యామిలీ అంగీకరించక పోయినా తర్వాత కలిసిపోయారని అంటుంటారు.

తారకరత్న

తారకరత్న

హీరోగా సక్సెస్ కాకపోవడంతో విలన్ గా ట్రై చేసాడు. నారా రోహిత్ హీరోగా వచ్చిన రాజా చెయ్యి వేస్తే సినిమాలో నటించాడు. ఆ సినిమాలో తారక రత్న నటనకు మంచి పేరే వచ్చినా తారకరత్న ఆశించిన స్థాయిలో పాత్రలు రావడం లేదని టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X