ఎన్టీఆర్ వారసత్వం : ‘కలియుగ రాముడు’ ఫస్ట్‌లుక్
రాముడు పాత్ర అయినా....కృష్ణుడి పాత్ర అయినా మనకు ముందుగా గుర్తుకొచ్చేది ది గ్రేట్ యాక్టర్ జూనియర్ ఎన్టీయారే. ఆయన వారసత్వం అందుకున్న ఇతర నందనమూరి హీరోలు కూడా రాముడి తెరపై రాముడి పాత్రలు పోషించారు. బాలకృష్ణ 'శ్రీరామ రాజ్యం' సినిమాలో రాముడిగా నటిస్తే, జూ ఎన్టీఆర్ 'బాల రామాయణం' చిత్రంలో రాముడి గెటప్ వేశారు.
తాజాగా మరో వారసుడు, నందమూరి తారక రత్న రాముడి పాత్రలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇది పౌరాణిక సినిమా కాక పోయినా...స్క్రిప్టులో భాగంగా ఈ గెటప్ ప్లాన్ చేశారు. ఈ చిత్రానికి 'కలియుగ రాముడు' అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయింది. ఇందులో తారక రత్న నీలమేఘ శ్యాముడిగా ఆకట్టుకుంటున్నాడు.
తారకరత్న, అర్చన, కృష్ణుడు ప్రధాన తారాగణంగా వీరు.కె దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుంది. ఆర్.ఎ. ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మాత జాని నిర్మిస్తున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు సోమవారం హైదరాబాద్ లోని సంస్థ కార్యాలయంలో జరిగాయి. ఈ సందర్భంగా నిర్మాత జాని మాట్లాడుతూ, ఈ నెల 15న లేదా 16న జరుగబోయే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభోత్సవానికి పలువురు చిత్ర ప్రముఖులు విచ్చేస్తారని చెప్పారు. కలియుగ సీతగా అర్చన, రావణాసురుడిగా కృష్ణుడు కనిపిస్తాడని, అదే పాత్రను ఈచిత్రంలో కొనసాగిస్తూ...సూపర్ స్టార్ కృష్ణ పాటలకు డాన్స్ చేసి అలరిస్తారని చెప్పారు.
దర్శకుడు వీరు.కె మాట్లాడుతూ... బ్రహ్మానందం, ఎం.ఎస్. నారాయణ, కృష్ణ భగవాన్, కొండవలసలతో పాటు కామెడీ విలన్ గా షాయాజీ షిండే, ఫ్యాక్షనిస్ట్ లీడర్‌గా సుమన్ చక్కటి పాత్రలను పోషిస్తున్నారని చెప్పారు. ఈ నెల 23వ తేదీ నుంచి రాజమండ్రి, రాజోలు, హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో 50 రోజుల పాటు ఏకధాటిగా షూటింగ్ జరుపుకుంటుందని, జూన్‌లో విదేశాలలో ఓ ఫైట్, ఓ పాటను చిత్రీకరిస్తామని ఆయన తెలిపారు.


Click it and Unblock the Notifications











