బాబాయ్‌ని ఫాలో అవుతున్నాడా? విజయం దక్కేనా?

By Bojja Kumar

ఈ నెల 15న విడుదల కాబోతున్న తారక రత్న 'నందీశ్వరుడు' సినిమా అతని కెరీర్ కు మలుపు లాంటిదని, ఈ సినిమా హిట్టయితే తప్ప తారక రత్న సినీ జీవితం వెండి తెరపై సాఫీగా సాగే అవకాశాలు లేవని సీని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. తారక రత్నతో పాటు, ఆ సినిమా దర్శక నిర్మాతలు కూడా నందీశ్వరుడు సినిమా విజయంపై నమ్మకంతో ఉన్నారు.

అయితే ఫిల్మ్ నగర్లో మాత్రం ఓ ప్రచారం సాగుతోంది. బాబాయ్ బాలయ్య హీరోగా చేయాలనుకున్న 'నందీశ్వరుడు' టైటిల్ ను తీసుకున్న తారక రత్న, బాలయ్య తరహాలోనే మాస్ మసాలా అంశాలతో, సాధారణంగా నందమూరి హీరోలు తరచూ ఉపయోగించే వంశం, పౌరుషం పదాలు వాడిన పవర్ ఫుల్ డైలాగులతో పాటు, ఇది వరకు బాలయ్య కనిపించిన గెటప్ లోనే కనిపించబోతున్నాడని అంటున్నారు. మరి సినిమా రిజల్ట్ ఏమిటో సినిమా విడుదలైతేగానీ తెలియదు.

ఈ చిత్రంలో బిందాస్ ఫేం షీనా హీరోయిన్ గా నటిస్తున్న ఈచిత్రానికి రచన : పరుచూరి బ్రదర్స్, కెమెరా : సుధాకర్ రెడ్డి, సంగీతం : పార్థు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : యువరాజ్, నిర్మాతలు : డా. కోట గంగాధర్ రెడ్డి, సెగు రమేస్ బాబు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : శీను యరజాల.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X