twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తారక రత్న'మైక్‌టెస్టింగ్‌ 143'స్టోరీలైన్

    By Srikanya
    |

    నందమూరి తారకరత్న, అర్చన, నరేష్‌, బ్రహ్మానందం తదితరులు నటిస్తున్న చిత్రం 'మైక్‌ టెస్టింగ్‌ 143'. ఈ చిత్రంలో తారకరత్న దయానంద్ గా కనపించనున్నారు. ఉత్సవాలు, పండుగల సమయాల్లో నాటకాలు వేసే కంపెనీ నడుపుతుంటాడు దయానంద్‌. దయానంద్‌కి నాటకాలంటే ఎంతో అభిమానం. ఓ సినిమాని వెండితెరపై గొప్పగా మలచాలని దర్శకుడు ఎంత తపన పడతాడో.. తను రూపొందించే నాటకం కూడా వేదికపై అదిరిపోయేలా ఉండాలని కష్టపడతాడు. దసరాకి నాటకం వేయడానికి రాయలసీమలోని ఓ ప్రాంతం నుంచి ఆహ్వానం అందుతుంది. అక్కడికి వెళ్లిన దయానంద్‌కి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయో తెరపైనే చూడాలి.

    వీరు.కె. దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం లో తారకరత్న సరసన అర్చన జంటగా నటిస్తున్నారు. కె.రాజు నిర్మాత. కొంత టాకీ పూర్తయింది. 4 నుంచి హైదరాబాద్‌లో చిత్రీకరణ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దర్శకుడు మాట్లాడుతూ...'ప్రసుత్తం హైదరాబాద్‌ పరిసరాల్లో ఓ పాట సహా టాకీ చిత్రీకరిస్తున్నాం. కొడైకెనాల్‌ శ్రీరాముని గుడి ప్రాంగణంలో షూటింగ్‌ చేస్తాం. స్టేజీపై నవరాత్రుల సన్నివేశాలను అక్కడ చిత్రిస్తాం. మూడు పాటలు బ్యాంకాక్‌, పుకెట్‌, ఐలాండ్‌లలో తెరకెక్కిస్తాం. రెండో నాయికను ఎంపిక చేయాల్సి వుంది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి జులైలో విడుదల చేస్తాం' అన్నారు.

    చక్కటి వినోదాన్ని పంచే చిత్రంలో తొలిసారిగా నటిస్తున్నానని తారక్‌ చెప్పారు. మా బ్యానర్‌లో ఇది 6వ సినిమా..అని నిర్మాత రాజా తెలిపారు. సీతగా మరోసారి కన్పించనున్నట్టు అర్చన పేర్కొంది. సుమన్‌, సాయాజీ షిండే, కృష్ణుడు, బ్రహ్మానందం, నరేష్‌, జీవా, కొండవలస తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: అంజి, సంగీతం, దర్శకత్వం: వీరు కె.

    English summary
    Nandamuri Taraka Ratna is all set to hit the screens again with " Mike Testing 143" opposite Archana. The movie that was launched a few days ago. Directed by K Veeru, which is touted to be a comedy. Tarakaratna says, "The film is a total commercial entertainer with the right blend of a love story and family drama. I hope the audiences enjoy it."
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X