తారక రత్న ‘దయ’-మరి ప్రేక్షకుల దయ దక్కేనా?
ఈ సందర్భంగా యూనిట్ సభ్యులు మాట్లాడుతూ, లవ్ - సెంటిమెంట్ సమపాళ్లలో రంగరించిన ఆసక్తికరమైన కథాంశంతో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్టు చెప్పారు. రెగ్యులర్ షూటింగ్ ఈనెల 15 నుంచి హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుందనీ, రెండవ షెడ్యూల్‌ని జూలైలో ప్లాన్ చేశామని అన్నారు.
ఇప్పటి వరకు కెరీర్లో సరైన హిట్ లేని తారక రత్న హీరోగా నిలదొక్కుకోవడానికి చాలా ట్రై చేస్తున్నాడు. ఇప్పటి వరకు రకరకాల కాన్సెప్టులతో తారకరత్న ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆయన నటించిన ఏ సినిమా కూడా అలరించక పోవడంతో ప్రేక్షకులు అతనిపై దయ చూపలేదు. దీంతో ఈ సారి ఏకంగా 'దయ' అనే టైటిల్ తోనే వచ్చేశాడు. పాపం ఈ సినిమా టైటిల్ చూసైనా ఆడియన్స్ తారకరత్న పట్ల దయ చూపుతారో? చూడాలి.
తారకరత్న ప్రస్తుతం మరో కామెడీ చిత్రంలోనూ నటిస్తున్నాడు. తారకరత్న, అర్చన, కృష్ణుడు ప్రధాన తారాగణంగా వీరు.కె దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఆర్.ఎ. ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మాత జాని నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అయింది. ఇందులో తారకరత్న రాముడి గెటప్‌లో కనిపించనున్నాడు.


Click it and Unblock the Notifications












