twitter
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

Taraka Ratna: తారకరత్నకు ప్రాణాంతక వ్యాధి.. అందుకే తీవ్ర రక్తస్రావం.. బయటకు వచ్చిన మరో చేదు నిజం

తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ హీరో నందమూరి తారకరత్న గుండెపోటుకు గురైన విషయం తెలిసిందే. కుప్పంలో జరిగిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రలో తారకరత్న అస్వస్థతకు గురయ్యారు. కొద్ది దూరం నడిచిన ఆయన అకస్మాత్తుగా సొమ్మసిల్లి పడిపోయారు. ఇది గుండెపోటు అని గుర్తించిన వైద్యులు చికిత్సను అందిస్తున్నారు. అంతేకాదు, ఆయనను బెంగళూరులోని నారాయణ హృదయాల ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా తారకరత్న ఆరోగ్యం గురించి మరో చేదు నిజం తెలిసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

తారకరత్న పరిస్థితి విషమంగా

తారకరత్న పరిస్థితి విషమంగా

శుక్రవారం కుప్పంలో గుండెపోటుకు గురైన నందమూరి తారకరత్న పరిస్థితి అంతకంతకూ విషమంగానే మారుతోంది. అతడికి బెంగళూరులోని నారాయణ హృదయాల వైద్యులు నిరంతరాయంగా చికిత్సను అందిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ ఆయన పరిస్థితి మెరుగు పడడం లేదు. దీంతో నందమూరి అభిమానులు దీనిపై ఆందోళన చెందుతోన్నారు.

టాలీవుడ్ చరిత్రలో పవన్ సంచలనం: అవేమీ లేకుండానే సినిమా.. ఇది ఫ్యాన్స్ జీర్ణించుకుంటారా!
టాలీవుడ్ చరిత్రలో పవన్ సంచలనం: అవేమీ లేకుండానే సినిమా.. ఇది ఫ్యాన్స్ జీర్ణించుకుంటారా!

తారకరత్న హెల్త్ బులిటెన్‌లో

తారకరత్న హెల్త్ బులిటెన్‌లో

నారాయణ హృదయాల వైద్యులు శనివారం రాత్రి తారకరత్న హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. అందులో 'మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ తర్వాత కార్డియోజెనిక్ షాక్ కారణంగా ఆయన పరిస్థితి అత్యంత క్లిష్టంగా ఉంది. ఎక్మో వైద్య విధానం ద్వారా తారకరత్నకు కృతిమంగా శ్వాసనందిస్తున్నాం. బెలూన్ యాంజియోప్లాస్టీ ద్వారా రక్తాన్ని పంపింగ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాం' అని చెప్పారు.

చంద్రబాబు సహా వాళ్లందరూ

చంద్రబాబు సహా వాళ్లందరూ

తారకరత్నకు చికిత్స జరుగుతోన్న ఆస్పత్రిలోనే ఆయన భార్య అలేఖ్యా రెడ్డి, తండ్రి మోహనకృష్ణతో పాటు పలువురు కుటుంబ సభ్యులు ఉన్నారు. అలాగే, శనివారమే బాలయ్య అక్కడకు చేరుకున్నారు. ఇక, నిన్న సాయంత్రం చంద్రబాబు నాయుడు కూడా ఆస్పత్రికి చేరుకుని తారకరత్న పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈరోజు ఎన్టీఆర్ వచ్చే అవకాశం ఉంది.

బటన్స్ విప్పేసి రాశీ ఖన్నా బోల్డ్ షో: బాబోయ్ ఎద అందాల బీభత్సం
బటన్స్ విప్పేసి రాశీ ఖన్నా బోల్డ్ షో: బాబోయ్ ఎద అందాల బీభత్సం

ప్రాణాంతక వ్యాధితో బ్లీడింగ్

ప్రాణాంతక వ్యాధితో బ్లీడింగ్

నందమూరి తారకరత్నకు అంతర్గతంగా తీవ్ర రక్తస్రావం జరుగుతున్నట్లు వైద్యులు వెల్లడించారు. అయితే, ఇలా జరగడానికి కారణం అతడు కొంత కాలంగా 'మెలేనా' (Melena Disease) అనే జీర్ణాశయ సంబంధితమైన వ్యాధితో బాధపడుతుతండడమే అని తెలిసింది. దీనివల్లే ఇప్పుడు చికిత్స సమయంలో తారకరత్నకు ఇబ్బంది తలెంత్తిందని తెలుస్తోంది.

అసలు ఏంటీ మెలెనీ వ్యాధి?

అసలు ఏంటీ మెలెనీ వ్యాధి?

మెలేనా అనేది జీర్ణాశయాంతర రక్తస్రావానికి సంబంధించిన వ్యాధి. దీని బారినపడిన వారి మలం నల్లగా, జిగటగా వస్తుంది. మెలేనా వల్ల జీర్ణాంతర ట్రాక్ట్‌తో పాటు నోరు, అన్నవాహిక, పొట్ట, చిన్నపేగు మొదటి భాగం రక్తస్రావం అవుతుంది. కొన్ని కేసుల్లో ఎగువ జీర్ణాశయాంతర దిగువ భాగంలో ఉండే పెద్ద పేగు ఆరోహణ భాగంలోనూ రక్తస్రావం జరిగే అవకాశం ఉంటుందని వైద్యులు తెలిపారు.

Anchor Sravanthi Chokarapu: యాంకర్ స్రవంతి క్యూట్ పిక్స్ వైరల్.. క్లీవేజ్ షో మళ్లీ మొదలైందిగా!
Anchor Sravanthi Chokarapu: యాంకర్ స్రవంతి క్యూట్ పిక్స్ వైరల్.. క్లీవేజ్ షో మళ్లీ మొదలైందిగా!

మెలేనాకు చికిత్స ఎలాగంటే

మెలేనాకు చికిత్స ఎలాగంటే

సాధారణంగా మెలేనా వ్యాధి బారిన పడిన వారికి పెప్టిక్ అల్సర్స్ ట్రీట్‌మెంట్, ఎండోస్కోపీ థెరపీ వంటి చికిత్సలను చేస్తారని స్పెషలిస్టులు వెల్లడించారు. అలాగే, యాంజియోగ్రాఫిక్ ఎంబలైజేషన్, సర్జికల్ థెరపీలు, రక్తాన్ని మార్పిడి చేయడం వంటి చికిత్సలు అందిస్తారని తెలిపారు. సాధారణ పరిస్థితుల్లో మాత్రమే దీనికి ఇలాంటి చికిత్సలు చేయడం వీలవుతుందని కూడా పేర్కొన్నారు.

గుండెపోటు వస్తే తీవ్రంగానే

గుండెపోటు వస్తే తీవ్రంగానే

మెలేనా వ్యాధితో బాధ పడే వాళ్లకు గుండెపోటు వస్తే.. రక్త నాళాలలో జరిగే రక్తస్రావం కారణంగా గుండెకు వైద్యం అందించడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. అందుకే ఈ చికిత్సలో గుండెను కృత్రిమంగా కదిలించేందుకు ఎక్మో మెషీన్‌ను ఇంప్లాట్ చేస్తారు. ఇప్పుడు తారకరత్నకు కూడా ఇలాంటి చికిత్సనే చేస్తున్నారని వైద్య బృందం సవివరంగా వెల్లడించింది.

English summary
Tollywood Hero Nandamuri Taraka Ratna Gets Massive Heart Attack Last Friday. Now He Was Suffering With Melena Disease.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X