Alekhya Reddy: అయిన వాళ్లే బాధపెట్టారు.. జీవితమంతా కష్టాలే.. కన్నీళ్లతో తారకరత్న భార్య!

సినీ నటుడు, టీడీపీ నేత నందమూరి తారకరత్న మరణానంతరం అనేక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అప్పటివరకు సినిమాల్లో హీరోగా, విలన్ గా రాణించిన ఆయన రాజకీయపరంగా ఎదగాలనుకున్న సమయంలో హఠాత్తుగా గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. 23 రోజుల నిర్విరామంగా కొనసాగిన చికిత్స తర్వాత ఆయన మృత్యుఒడిలోకి వెళ్లారు. దీంతో సినీ లోకం, నందమూరి అభిమానులు తీవ్ర శోకసంద్రంలోకి వెళ్లిపోయారు. అయితే ప్రస్తుతం తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి బాధ మాత్రం వర్ణనాతీతంగా మారింది. పిల్లల కోసం కన్నీళ్లు దిగమింగు కుంటూ గుండె నిండా భారంతో తారకరత్నజ్ఞాపకాలతో కాలం గడుపుతున్నారు. తాజాగా ఆయన్ను తలుచుకుంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.

ఇద్దరు కలిసి జీవించేందుకు..

ఇద్దరు కలిసి జీవించేందుకు..

ఒకటో నెంబర్ కుర్రాడు సినిమాతో సినీ రంగంలోకి అడుగుపెట్టిన నందమూరి హీరో తారకరత్న తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత చేసిన సినిమాల్లో హీరోగా పెద్దగా రాణించలేకపోయినా ప్రతినాయకుడిగా మాత్రం అలరించారు. తారకరత్న.. అలేఖ్య రెడ్డి ఇద్దరూ కలిసి జీవించేందుకు ఒక యుద్ధమే చేశారు. ప్రేమ, పెళ్లి అనే విషయాలు వీరిద్దరి జీవితంలో అనేక సంఘర్షణలను నెలకొల్పాయి.

కొత్త జీవితం మొదలు..

కొత్త జీవితం మొదలు..

ఎన్నో ఇబ్బందులు, సమస్యలను ఎదుర్కుని మొత్తానికి తారకరత్న, అలేఖ్య రెడ్డి కలిసి జీవించేందుకు సిద్ధమయ్యారు. అయినవారందరికీ దూరం అయ్యారు. మనసులో భరించలేని బాధను చిరునవ్వుతో దాచేస్తూ కొత్త జీవితం మొదలుపెట్టారు. వీరి ప్రేమకు కూతురు నిషిక, తర్వాత కవలలు తాన్యారామ్, రేయా జన్మించారు. ఓవైపు సినీ పరిశ్రమలో కొనసాగుతూనే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు తారకరత్న. కుటుంబ సభ్యులకు దగ్గరవుతున్న సమయంలోనే ఊహించని విధందా తిరిగిరాని లోకానికి వెళ్లిపోయారు తారకరత్న.

మధురమైన.. క్లిష్టమైన..

మధురమైన.. క్లిష్టమైన..

నందమూరి తారక రత్న గుండెపోటుతో కుప్పకూలి దాదాపు 23 రోజులు మృత్యువుతో పోరాడి చివరికి ఓడిపోయారు. మహా శివరాత్రి అయిన ఫిబ్రవరి 18న తారకరత్న మరణించి నేటికి సరిగ్గా నెల రోజులు అవుతుంది. భర్త అకాల మరణంతో తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి బాధ చెప్పరాని విధంగా మారింది. కన్నీళ్లు దాచుకుంటూ పిల్లల కోసం.. తారకరత్నతో గడిపిన మధురమైన క్షణాలను, క్లిష్టమైన పరిస్థితులను గుర్తు చేసుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు.

చాలా నమ్మకంతో ముందుకు..

చాలా నమ్మకంతో ముందుకు..

తాజాగా చాలా ఎమోషనల్ గా పోస్ట్ షేర్ చేశారు అలేఖ్య రెడ్డి. "నువ్వు మమ్మల్ని వదిలి నేటికి సరిగ్గా నెల రోజులు అవుతోంది. కానీ నీ జ్ఞాపకాలు మాత్రం ఇప్పటికీ నా మదిలో సజీవంగానే ఉన్నాయి. మన పరిచయం స్నేహంగా.. స్నేహం ప్రేమగా మారింది. మనం డేటింగ్ చేశాం. కానీ మన రిలేషన్ పై నేను సందిగ్ధంలో ఉన్నాను. కానీ నువ్ మాత్రం చాలా నమ్మకంతో అడుగు ముందుకు వేశావ్. కొత్త అధ్యాయానికి తెరలేపావు" అని రాసుకొచ్చారు అలేఖ్య రెడ్డి.

మనపై చిమ్ముతున్న ద్వేషం..

మనపై చిమ్ముతున్న ద్వేషం..

"అప్పటి నుంచి ఎంతో పోరాడావు. మొత్తానికి మనం పెళ్లి చేసుకున్నాం. అప్పుడు ఎంతో గందరగోళం. ఎన్నో సంఘర్షణలు. ఎన్నో ఇబ్బందులు. మనపై వివక్ష. కానీ నేను నీతో చాలా సంతోషంగా ఉన్నాను. నిషికమ్మ పుట్టాక మన జీవితమే మారిపోయింది. అప్పటి నుంచి ఆనందం రెట్టింపు అయింది. కానీ మన కష్టాలు అలాగే ఉన్నాయి. మనపై చిమ్ముతున్న ద్వేషాన్ని తప్పించుకునేందుకు మనం కళ్లకు గంతలు కట్టుకుని బతికాం" అని తారకరత్న భార్య తెలిపారు.

పదే పదే గాయం చేస్తే..

పదే పదే గాయం చేస్తే..

"నీ కుటుంబానికి దూరమయ్యావ్ కాబట్టి మనకంటూ పెద్ద కుటుంబం ఉండాలని ఎప్పుడూ కలలు కనేవాడివి. 2019లో కవలలు జన్మించడంతో నీ కల నెరవేరింది. నీ చివరి శ్వాస వరకు ఎన్నో కష్టాలు పడ్డావు. నీ గుండెలో ఉన్న బాధ ఎవరికీ అర్థం కాలేదు సరికదా.. కనీసం దాన్ని ఎవరు పట్టించుకోలేదు. మనకు బాగా కావాల్సిన వాళ్లే మన మనసకు పదే పదే గాయం చేస్తే దాన్ని భరించలేం. అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు నేను ఏం చేయలేక నిస్సహాయంగా ఉండిపోయాను" అని ఆవేదన వ్యక్తం చేశారు అలేఖ్య రెడ్డి.

మళ్లీ కలుస్తామని..

"మనం ప్రయాణం మొదటి నుంచి చివరి వరకు సపోర్ట్ గా ఉన్న వారని కూడా మనం చాలా క్రితమే కోల్పోయాం. తర్వాత నిన్ను కూడా కోల్పోయాం. నువ్వు రియల్ హీరో. నిన్ను చూసి మేమంతా గర్విస్తున్నాం. మనం మళ్లీ కలుస్తామని ఆశిస్తున్నాను" అని బాధతప్తా హృదయంతో ఎమోషనల్ గా రాసుకొచ్చారు తారకరత్న సతీమణి అలేఖ్య రెడ్డి. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X