మహేష్ బాబు తో పోటీ ఏంటంటూ ఎన్టీఆర్
ఇక గతంలో వరస ఫ్లాపులు గురించి చెపుతూ... గతం గతమే కెరీర్‌లో ఎత్తుపల్లాలున్నాయి. గతం ఎప్పటికైనా గతమే. ఇప్పటిదాకా నేను నేర్చుకుంటూ వచ్చా. బాలయ్య బాబాయ్ 'సక్సెస్ వస్తే కళ్లు నెత్తికెక్కించుకోకు' అని చెప్పారు. ఆ మాటల్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటా అన్నారు. ఇక 'నందీశ్వరుడు'మంచి హిట్ అవుతుందని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు తారక్. ఈ చిత్రంలో హైలెట్స్ చెపుతూ..ప్లస్ పాయింట్స్ పాటలూ, యాక్షనూ ప్లస్ పాయింట్స్. సంగీత దర్శకుడిగా తొలి చిత్రమే అయినా పార్థసారథి అద్భుతమైన బాణీలిచ్చాడు. ఇక స్టంట్ డైరెక్టర్‌గా థ్రిల్లర్ మంజుకు ఇది కమ్‌బ్యాక్ మూవీ. చాలా గొప్పగా యాక్షన్ ఎపిసోడ్స్‌ను రూపొందించారు. పరుచూరి బ్రదర్స్ మాస్ డైలాగ్స్‌కి పెట్టింది పేరు. అలాగని ఇందులో ఓవర్ డైలాగ్స్ ఉండవు. సందర్భానుసారం చక్కని సంభాషణలు రాశారు బద్రర్స్. సుధాకర్‌రెడ్డి సినిమాటోగ్రఫీ అసాధారణం అన్నారు. తన తదుపరి ప్రాజెక్టు గురించి చెపుతూ..మళ్లీ శ్రీనుతోటే నా తదుపరి సినిమానూ శ్రీను డైరెక్షన్‌లోనే చేయబోతున్నా. అందులో ముగ్గురు హీరోయిన్లు ఉంటారు. ఆ సినిమా వివరాలు త్వరలో తెలియజేస్తాం అని చెప్పారు.


Click it and Unblock the Notifications












