ఎప్పటికైనా బాలయ్యే సీఎం

గతంలో కూడా తారకరత్న తన బాబాయ్ బాలకృష్ణ అనే స్టేట్ మెంట్ ఇచ్చి సంచలనం సృష్ఠించారు. ఇప్పుడు కూడా ఇలా మాట్లాడటం,ఎన్నికలు దగ్గరకొస్తున్న నేపధ్యంలో ఎలాంటి సంకేతాలు బయటకు అందుతాయోనని పార్టీ వర్గాలు అనుకుంటున్నారు. మరికొంత మంది తారకరత్న మాటలను పెద్దగా మాట్లాడాల్సిన పని లేదని అంటున్నారు. అలాగే ఆ మధ్య బాబు,తారకరత్నను పిలిచి ఇలా బాలయ్యే సీఎం వంటి స్టేట్ మెంట్స్ ఇవ్వద్దని స్పష్టంగా చెప్పారని,అయినా పదేపదే ఇదే విషయాన్ని చెప్పటంలో అంతరార్ధం ఏమిటన్నది చర్చనీయాంశమవుతోంది. అలాగే తారకరత్న ఆ మధ్య నటించిన వెంకటాద్రి సినిమా త్వరలో రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ చిత్రాన్ని సముద్ర డైరక్ట్ చేసారు.


Click it and Unblock the Notifications











