twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎప్పటికైనా బాలయ్యే సీఎం

    By Staff
    |

    tarakaratna
    ముఖ్యమంత్రి అయ్యేందుకు తమ బాబాయి బాలకృష్ణకు అన్ని అర్హతలూ ఉన్నాయని, ఎప్పటికైనా ఆయన ఆ పదవిని చేపట్టగలరని సినీ నటుడు నందమూరి తారకరత్న ప్రకటించారు. ఆదివారం నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ... అన్ని వర్గాల ప్రజలు అదే కోరుకుంటున్నందువల్ల తనకూ ఆ విశ్వాసం ఉందని చెప్పుకొచ్చారు. అలాగే తన పొలిటికల్ ఎంట్రీపై మాట్లాడుతూ...తెలుగువారి ఆత్మగౌరవ పరిరక్షణ ధ్యేయంగా టీ డీపీని స్థాపించిన తన తాత ఎన్టీఆర్‌కు మనవడిగా రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు.తన తాతగారి ఆశయసాధనకు నందమూరి వంశం కట్టుబడి ఉన్నదని అన్నారు.

    గతంలో కూడా తారకరత్న తన బాబాయ్ బాలకృష్ణ అనే స్టేట్ మెంట్ ఇచ్చి సంచలనం సృష్ఠించారు. ఇప్పుడు కూడా ఇలా మాట్లాడటం,ఎన్నికలు దగ్గరకొస్తున్న నేపధ్యంలో ఎలాంటి సంకేతాలు బయటకు అందుతాయోనని పార్టీ వర్గాలు అనుకుంటున్నారు. మరికొంత మంది తారకరత్న మాటలను పెద్దగా మాట్లాడాల్సిన పని లేదని అంటున్నారు. అలాగే ఆ మధ్య బాబు,తారకరత్నను పిలిచి ఇలా బాలయ్యే సీఎం వంటి స్టేట్ మెంట్స్ ఇవ్వద్దని స్పష్టంగా చెప్పారని,అయినా పదేపదే ఇదే విషయాన్ని చెప్పటంలో అంతరార్ధం ఏమిటన్నది చర్చనీయాంశమవుతోంది. అలాగే తారకరత్న ఆ మధ్య నటించిన వెంకటాద్రి సినిమా త్వరలో రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ చిత్రాన్ని సముద్ర డైరక్ట్ చేసారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X