అన్నీ జూ ఎన్టీఆర్ కేనా?:తారకరత్న

అందు నిమిత్తం తొలుత గురువు పాలంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన తారకరత్న తర్వాత నారా కోడూరు చేరుకున్నారు. సెంటర్లో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఆనంతరం చుట్టూ చూసారు. అక్కడ అన్నీ జూనియర్ ఎన్టీఆర్,బాలకృష్ణ,ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్రకుమార్ ఫ్లెక్సీలే ఉన్నాయి. దాంతో ఆయనకు కోపం వచ్చి పై విధంగా స్పందించారు. ఆ తర్వాత మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ జోక్యంతో గంట తర్వాత చేబ్రోలు చేరుకున్నారు. అక్కడ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించి సభలో ప్రసంగించారు.
తిరిగి గుంటూరు వెళుతుండగా నారా కోడూరు సెంటర్లో పార్టీ కార్య క్రమాలు తారకరత్న కారును నిలిపివేసారు. ఘోరావ్ చేస్తూ..ఫ్లెక్సిలో నీ బొమ్మలు చూసుకోవటానికి వచ్చావా పార్టీ ప్రతిష్టను పెంచటానికి వచ్చావా...అంటూ కార్యకర్తలు నిలదీసారు. నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు్..కాసేపు మీ బాబాయ్ సీఎం అంటావ్..మరి కాసేపు మా మామయ్య సీఎం అంటావ్..నువ్వే మాట్లాడుతున్నావో నీకే తెలియటం లేదు అన్నారు. అంత సేపు తారకరత్న కారులోనే ఉండిపోయారు. దాదాపు అరగంట సేపు ఉద్రిక్తత నెలకొనటంతో అక్కడి నాయకులు వచ్చి సర్ధి చెప్పటంతో అంతా శాంతించారు.


Click it and Unblock the Notifications











