జై బాలయ్య..జై ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేసినందుకు తారకరత్నకు ఎక్కడ లేని కోపం వచ్చింది. పార్టీ కోసమే నేను పనిచేస్తున్నానని, నేను వచ్చినప్పుడల్లా నన్ను గుర్తించకుండా అవమానపరచటం సమంజసం కాదు అంటూ తెలుగుదేశం అభిమానులు, కార్యకర్తలపై ఆయన చిర్రుబుర్రులాడారా. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ తరుపున ప్రచారం చేసేందుకు వచ్చిన నందమూరి వారసుడు తారకరత్నఆ విధంగా అందరిపై కోప్పడటం ఇబ్బంది కలిగించింది. అంతేగాక ప్రసంగంలో సైతం తారక్ వీలు చిక్కినప్పుడల్లా కార్యకర్తలపై ఆయన నిప్పులు చెరిగారు. దీన్ని గమనించిన కార్యకర్తలు వెంటనే మాట మార్చి తారక్ కి జై అంటూ నినాదాలు చేసారు. దీంతో కాస్సేపటికి ఉత్సాహం తెచ్చుకుని వారితో కలసి ద్విచక్ర వాహనంపై ప్రచార కార్యాలయానికి వెళ్ళారు.
Story first published: Thursday, April 16, 2009, 12:24 [IST]