విలన్ గా నందమూరి నాయకుడు

By Staff

తన సినిమా రంగ ప్రవేశమే ఏకంగా 9 సినిమాలతో మొదలుపెట్టిన నందమూరి హీరో తారకరత్న. ఎంతో ఘనంగా మొదలైన ఈ సినిమాలలో మూడు చిత్రాలు మినహా, మిగతా చిత్రాలకు మోక్షం లభించలేదు. వచ్చినా ఆ మూడు చిత్రాలు ఘోరపరాజయాన్ని చవిచూసాయి. దీంతో తారకరత్న సినిమాలంటే జనం జడుసుకొనేవారు.

ఆ తర్వాత అరకొర చిత్రాలలో నటించినా ఆశించినంత గుర్తింపు రాలేదు. తారకరత్న హీరోగా కాకుండా విలన్ గా అయితే బాగుంటాడని ఫిలిం నగర్ లో చెప్పుకొనేవారు. ఆ వార్త ఆ నోటా ఈ నోటా పడి తారకరత్నను చేరిందో ఏమో ప్రస్తుతం ఆయన హీరో వేషాలకి స్వస్తి చెప్పి విలన్ వేషాలకు సిద్ధమయ్యారు.

దీనికి రవిబాబు దర్శకత్వంలో వస్తున్న "అమరావతి" చిత్రం వేదికయింది. భూమిక, స్నేహ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సస్పెన్స్ థ్రిల్లర్ లో తారకరత్న విలన్ గా నటిస్తున్నాడు. కనీసం ఈ చిత్రంతోనైనా తనకు తగిన గుర్తింపు లభిస్తుందని ఆశిస్తున్నాడు. "అనసూయ" చిత్రంలో విలనిజాన్ని సరికొత్త కోణంలో చూపించిన రవిబాబు ఈ చిత్రంలో తారకరత్నను ఎలా చూపించాడో తెలుసుకోవాలంటే సినిమా వచ్చే వరకూ వేచిచూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X