కొత్త దర్శకుడితో చేయనున్న తారకరత్న
"ఎన్టీఆర్ (తారకరత్న) ఈ చిత్రంలో మొదటిసారి పవర్‌ఫుల్ పోలీసు ఆఫీసరుగా కనిపించబోతున్నారు. ఈ చిత్రం స్టూడెంట్ బ్యాక్ డ్రాప్‌లో నడిచే ఒక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ఈ చిత్రం తారకరత్న ఇంతకు ముందు చేసిన సినిమాల కన్నా భిన్నంగా ఉంటుంది. ఆయన పోషించే పాత్ర విభిన్నంగా ఉంటుంది" అని దర్శకుడు రాజారెడ్డి అన్నారు.
సెప్టెంబర్ మొదటివారంలో షూటింగు ప్రారంభమై, రెండు షెడ్యూళ్లలో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగు పూర్తి చేసుకుని, నవంబర్ చివరి వారంలో చిత్రాన్ని విడుదల చేస్తామని ఆయన చెప్పారు. ఈ చిత్రంలో ప్రముఖ హీరోయిన్ ఐటం సాంగ్ చేస్తుందని కూడా ఆయన చెప్పారు ఈ చిత్రంతో కొలను నాగార్జున రెడ్డి, రామకృష్ణ వెండితెరకు పరిచయమవుతున్నారని దర్శకుడు తెలిపారు.
కథ: రామకృష్ణ, చింత శ్రీనివాస్
పాటలు: మంగరాజ్
పిఆర్వో: కడలి రాంబాబు
నిర్మాత: పియల్‌కె రెడ్డి
స్కీన్‌ప్లే, దర్శకత్వం: పొనుగంటి రాజారెడ్డి


Click it and Unblock the Notifications












