నాగార్జునతో క్లాష్ ఎందుకనుకున్న ఎన్టీఆర్
నాగార్జున, ఎన్టీఆర్(తారకరత్న) చిత్రాలు రెండూ ఒకే రోజు విడుదల ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే నాగార్జునతో క్లాష్ ఎందుకనుకున్నాడో ఏమో కానీ పోటీ నుంచి తప్పుకున్నాడు. తన చిత్రం నందీశ్వరుడు విడుదల తేదీని మరో వారం ముందుకు తోసాడు. షీనా హీరోయిన్ గా చేసిన నందీశ్వరుడు చిత్రం కన్నడంలో సంచలన విజయం సాధించిన డెడ్లీ సోమా సినిమాకు రీమేక్. బిందాస్ ఫేమ్ షీనా హీరోయిన్ గా చేసిన ఈ చిత్రాన్ని అంజి శ్రీను డైరక్ట్ చేసాడు. అలాగే జగపతి బాబు సైతం ఈ చిత్రంలో కీ రోల్ చేసాడు. పరుచూరి బ్రదర్స్ అందించిన డైలాగ్స్ ఈ చిత్రానికి ప్లస్ అవుతాయని భావిస్తున్నారు.
ఇక రాజన్న విషయానికి వస్తే.. డిసెంబర్ 23 న విడుదల కానున్న రాజన్న చిత్రం పై మంచి అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రంలో నాగార్జున రాజన్నగా కనిపించనున్నారు. ఈ చిత్రం ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన యధార్ధ గాథ ఆధారంగా తీస్తున్నారు. రజాకార్ల ఉద్యమం నేపథ్యంలో సాగే కథ ఇది. బడుగు, బలహీన వర్గాల ప్రజలపై రజాకారులు సాగించిన అన్యాయాలు, దౌర్జన్యాలపై తిరుగుబాటు చేసి, ప్రజల్లో చైతన్యాన్ని నింపుతాడు రాజన్న. తను ఒక విప్లవకారుడు. రాజన్న పోరాటం రజాకార్లు, దొరలపైన మాత్రమే కాదు.. ప్రతి అన్యాయంపైన. ఎక్కడ అన్యాయం కనిపిస్తే... అక్కడ రాజన్న ఉద్భవిస్తాడు. ప్రజలకు ఒక మంచి జీవితాన్ని ఇవ్వాలనే ఆశయంతో పోరాటం చేస్తాడు. నేలకొండపల్లెలోని గ్రామస్తులకు తన పాట ద్వారా ధైర్యం నూరిపోస్తాడు రాజన్న. పాట ప్రధానంగా సాగే సినిమా కథ ఇది.


Click it and Unblock the Notifications











