షో లకు ఓట్లు పడటం ఓ భ్రమ అని తారకరత్న వ్యాఖ్యానించారు. కర్నూలు జిల్లాలోని రాంపురం జాతరకు హాజరైన తారక్ మీడియాతో మాట్లాడారు. రాజకీయాల్లో జయాపజయాలు సాధారణమని చెప్పారు. అలాగే తాతగారి ఆశయం నేరవేర్చి తెలుగు దేశం పార్టీని బలోపేతం చేయటానికి తాము ప్రచారం చేస్తున్నామన్నారు. అలాగే ఇతర పార్టీల గురించి తాను కామెంట్ చేయనన్నారు. అయితే సినీ తారలు పోల్గొనే రోడ్ షోలో ప్రజలు లక్షలు మంది వచ్చినంత మాత్రాన గెలుస్తామనుకోవటం ఒట్టి భ్రమేనని ఆయన స్పష్టం చేసారు. ఇలా ఇతరులపై కామెంట్స్ చేయనంటూనే చిరంజీవి రోడ్ షోలపై తారక్ కామెంట్స్ చేయటం అంతటా చర్చనీయాంశమైంది.కొందరు చిరుకు చురక వేసారంటే..మరికొందరు..త్వరలో బాలయ్య,ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ వంటి వారు రోడ్ షోలకు వస్తున్నారు కదా..అనవసరంగా ఈ విషయాన్ని కదిపారని అనుకున్నారు.
Story first published: Friday, January 16, 2009, 15:44 [IST]