twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘ఎన్టీఆర్’గా అందుకే మార్చుకున్నా: తారకరత్న

    By Srikanya
    |

    ఎన్టీఆర్'గా పేరు మార్చుకోవాలనుకోవడానికి కారణం ...'నందీశ్వరుడు' చిత్ర నిర్మాతల్లో ఒకరైన రమేష్‌బాబు. ఆయన న్యూమరాలజీని బాగా విశ్వసిస్తారు. అయనే నా పేరుని ఎన్టీఆర్‌గా మార్చుకోమన్నారు. అంతకన్నా అదృష్టమా అనుకున్నా. ఆ పేరుతో కన్ ఫ్యూజన్ రాదా అని చాలామంది అడిగారు. నా దృష్టిలో అలాంటి సమస్యే ఉండదు. సినిమా పరంగా నా పేరు ఎన్టీఆర్ అని మార్చుకున్నా కూడా, నన్ను బయట తారకరత్న అని పిలుచుకోవచ్చు. అంతేకానీ బయట కూడా నన్ను ఎన్టీఆర్ అని పిలవమని ఫోర్స్ చేయడం లేదు అని అన్నారు నందమూరి తారకరత్న.

    తన తాజా చిత్రం 'నందీశ్వరుడు' ఈ సంక్రాంతికి విడుదల అవుతోంది. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు. అలాగే ...ఇదే టైటిల్‌తో గతంలో బాలకృష్ణ ఓ సినిమా చేయాలనుకున్నారు. ఆ విషయమై క్లారిఫై చేస్తూ..అవును నిజమే. అయితే ఎందుకనో కుదర్లేదు. బాబాయ్ చేయాలనుకున్న టైటిల్‌తో నేను సినిమా చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ కథకు ఇదే సరైన టైటిల్. బాబాయ్ అనుమతితోనే టైటిల్ తీసుకున్నాం అన్నారు. ఇక 'నందీశ్వరుడు'లో తనని ఆకట్టుకున్న అంశాలు గురించి చెపుతూ...డెడ్లీసోమా అనే కన్నడ సినిమా ప్రేరణతో దర్శకుడు శ్రీను యరజాల ఈ కథ రాశారు. అయితే మాతృకకు భిన్నంగా ఉంటుంది. నాతోనే చేయాలని చాలాకాలంగా ఎదురుచూస్తున్నాడు డెరైక్టర్. ఇందులో అన్ని అంశాలూ ఉన్నాయి. జగపతిబాబు పాత్ర చిత్రణ, యాక్షన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి అన్నారు.

    English summary
    Tarakaratna changed his screen name as NTR for numerology.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X