కె.ఎస్.నాగేశ్వరరావు దర్శకత్వంలో ఎన్టీఆర్

By Srikanya

శ్రీహరితో శ్రీశైలం వంటి ఎన్నో యాక్షన్ చిత్రాలు తీసిన కె.ఎస్ నాగేశ్వరరావు దర్శకత్వంలో ఎన్టీఆర్ గా పేరు మార్చుకున్న తారకరత్న ఓ చిత్రం కమిటయ్యారు. శ్రీ వెంకటరమణ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై పారిశ్రామికవేత్త ముత్తినేని సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముత్తినేని రవీంద్రతేజ సమర్పిస్తున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు సంస్థ కార్యాలయంలో జరిగాయి. ఈ చిత్రం గురించి దర్శకుడు నాగేశ్వరరావు మాట్లాడుతూ "ఈ చిత్రానికి అద్భుతమైన సబ్జెక్టు సిద్ధమైంది.ఏ విషయంలోనూ రాజీపడకుండా ఈ చిత్రాన్ని నిర్మించేందుకు సత్యనారాయణగారు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం'' అని చెప్పారు. నిర్మాత సత్యనారాయణ మాట్లాడుతూ "తారకరత్న, నాగేశ్వరరావు కాంబినేషన్‌లో ఓ మంచి కమర్షియల్ చిత్రాన్ని నిర్మిస్తున్నందుకు సంతోషంగా ఉంది.

కచ్చితంగా పెద్ద హిట్టయ్యే సినిమా ఇది'' అని తెలిపారు. ఇక తారకరత్న నందీశ్వరుడు చిత్రం చేస్తున్నారు. నందీశ్వరుడు చిత్రం నుంచి తన పేరుని ఎన్టీఆర్ గా మార్చుకున్నారు. నందీశ్వరుడు చిత్రం పాటలు షూటింగ్ జరుగుతుంది. ఇక కెఎస్ నాగేశ్వరరావు ఆ మధ్య నమితతో దేశద్రోహి చిత్రం ప్రారంభించారు. కానీ ఆ సినిమా వర్కవుట్ కాలేదు. ఇక ఈ చిత్రానికి వెలిగొండ శ్రీనివాస్ మాటలు అందిస్తున్నారు. అలాగే ఛాయాగ్రహణం: పి.ఎస్. బాబు, కూర్పు: నందమూరి హరి, నిర్మాణ సారథ్యం: లగడపాటి శ్రీనివాసరావు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X