నందమూరి తారకరత్న భయపెడుతున్నాడా !?
తీసింది ఒక్క థ్రిల్లర్ సినిమానే అయినా 'అనసూయ" తో అలాంటి సినిమాలు హ్యాండిల్ చేయడంలో సిద్దహస్తుడని పేరు తెచ్చుకున్నాడు రవిబాబు. మరోసారి అదే జోనల్ లో అతను రూపొందించిన చిత్రం 'అమరావతి". భూమిక, స్నేహ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో నందమూరి తారకరత్న సైకో కిల్లర్ గా నెగెటివ్ రోల్ చేశాడు. డిసెంబర్ 3న విడుదల కానున్న 'అమరావతి"కి సబ్లిసిటీ ఘనంగా చేస్తున్నారు. ప్రధానంగా ఒక్క మాస్క్ తో కవర్ చేసిన తారకరత్న ఫేస్ ని పోస్టర్స్ పై ఎక్కువగా ముద్రించారు. హాలీవుడ్ లో మోస్ట్ పాపులర్ క్యారెక్టర్ అయిన హేనిబల్ లెక్టర్ కి తొడిగిన మాదిరి మాస్క్ నే ఇందులో తారకరత్నకి మాస్క్ నే ఇందులో తారకరత్న పోస్టర్స్ జనాన్ని తెగ భయపెడుతున్నాయి. థ్రిల్లర్ కథాంశంతో ఈ సినిమా రూపొందిందని , కథ, కథనాలు ఆసక్తికరంగా ఉంటాయన్నారు. ఈ చిత్రంలో పాటలుండవు. నేపథ్య సంగీతమే ఈ చిత్రానికి వెన్నెముక అని అన్నారు. ఇంకా గద్దె సింధూర, కోట శ్రీనివాసరావు తదితరులు ఇతర పాత్రలు పోషించారు.


Click it and Unblock the Notifications











