తారకరత్నకి కూడా రాజమౌళే..

By Srikanya

ఈ మధ్యన ఏ సినిమా ఓపినింగ్ లో క్లాప్ కొట్టాలన్నా,ఆడియో పంక్షన్ లో సిడి ఆవిష్కరించాలన్నా వారికి ముందుగా కనపడుతున్నది రాజమౌళే.ఈయన తాజాగా తారకరత్న హీరోగా ప్రారంభమైన 'నందీశ్వరుడు'చిత్రానికి క్లాప్ కొట్టారు.అంజి శ్రీను దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రానికి బోయపాటి శ్రీను గౌరవ దర్శకత్వం వహించారు.ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ కన్నడ చిత్రం 'డెడ్లీ సోమా' స్ఫూర్తితో అల్లుకొన్న కథ ఇది. మన వాతావరణానికి తగిన మార్పులు చేశాం. పరుచూరి బ్రదర్స్‌ అందించిన సంభాషణలు ప్రధాన బలం. ఓ ప్రముఖ హీరో కూడా నటిస్తారన్నారు.

పిచ్చి కుక్కులను చంపడానికి పిస్తోలు అక్కర్లెద్దు. పిడికిలి చాలు.. ఇలాంటి సంభాషణలు రాయడానికి వీలు చిక్కింది. ఈ సినిమాతో తారకరత్న మాస్‌ కథానాయకుడిగా నిలబడతాడు.కన్నడంలో 200 రోజులు ఆడిన డెడ్లీసోమను మన నేటివిటీకి అనుగుణంగా మార్చి ఈ కథను తయారు చేశాం.తారకరత్నలో మంచి నటనా పటిమ ఉంది. అమరావతి సినిమా చూసే తనకు నంది అవార్డు వస్తుందని చెప్పాం. కథ, కథనం, సంభాషణలు అన్నీ టైటిల్‌కి తగ్గట్టుగా పవర్‌ఫుల్‌గా ఉంటాయి. ఇందులో తారకరత్న పోలీసాఫీసర్‌గా కనిపిస్తాడు. సమాజాన్ని మార్చాడా, లేక తానే మారాడా అనేది ఈ చిత్ర కథాంశం అన్నారు.

తారకరత్న మాట్లాడుతూ నటుడిగా నేనేంటో నిరూపించుకోవాలనే కసితో ఈ సినిమా చేస్తున్నాను. పరుచూరి బ్రదర్స్ నా సినిమాకు మాటలు రాయడం నా అదృష్టంగా ఫీలవుతున్నాను అన్నారు. అజయ్‌, రాజీవ్‌ కనకాల, జీవీ, బెనర్జీ, చలపతిరావు, ఢిల్లీ రాజేశ్వరి తదితరులు నటిస్తున్నారు. సంగీతం: పార్థు, కూర్పు: కె.వి.కృష్ణారెడ్డి, ఛాయాగ్రహణం: సుధాకర్‌ రెడ్డి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X