తారక్ 'నందీశ్వరుడు' స్టోరీ లైన్ ఏంటి?
నందమూరి తారకరత్న కొత్త చిత్రం 'నందీశ్వరుడు'. ఈ చిత్రం కథ గురించి తారక్ మీడియాతో మాట్లాడుతూ...కాలేజీలకు వెళ్లేది కులాసాగా తిరిగేందుకు కాదు... కన్నవాళ్ల కలల్ని నిజం చేసేందుకే అనుకొన్నాడు ఆ యువకుడు. చదువే లోకంగా భావించే అతగాడు అనుకోని పరిస్థితుల్లో కత్తి పట్టాల్సి వస్తుంది. ఆ ఉత్తమ విద్యార్థి కాస్తా... సంఘ విద్రోహశక్తిగా మారతాడుఅతను అలా అయ్యేందుకు దారి తీసిన పరిస్థితులేమిటో తెర మీదే చూడమంటున్నారు. . హీరో పేరు నందు . ఇక ఉన్నత కుటుంబంలో పుట్టిన వ్యక్తి తల్లి ఆశయం కోసం సిటీకి వెళ్తాడు. అక్కడ అనుకోని సంఘటనల్లో ఇరుక్కుని డాన్‌గా మారుతాడు."శివుడికి నందీశ్వరుడు ఎలా కాపలా కాస్తాడో, సమాజానికి మా నందీశ్వరుడు కూడా అలాంటివాడే. ఆ తర్వాత ఏమైంది? అనేది కథ అన్నారు.
ఇక 'నందీశ్వరుడు'లో షీనా హీరోయిన్ గా చేస్తోంది. అలాగే మరో కీలకపాత్రలో జగపతిబాబు కనిపిస్తారు. సంక్రాంతి కానుకగా ఈ నెల 14న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దర్శకుడు శ్రీను యరజాల మాట్లాడుతూ ''యువతరాన్నే కాదు కుటుంబ ప్రేక్షకుల్నీ మెప్పించేలా తీర్చిదిద్దాం. కథలోని మలుపులు ఆకట్టుకొంటాయి..అలాగే.. మా 'నందీశ్వరుడు' ట్రైలర్స్, ఇంటర్వెల్ బ్లాగ్ చూసి రాజమౌళి క్లాప్స్ కొట్టారు. ప్రతి ఒక్కరూ కసితో చేసిన చిత్రమిది. విజయాన్ని మాత్రమే కాంక్షిస్తూ పాటుపడ్డాం. దానికి తగ్గ ప్రతిఫలం అందుతుందన్న నమ్మకం ఉంది అని అన్నారు. రాజీవ్ కనకాల, నాగినీడు, అజయ్, జీవీ తదితరులు నటించారు. రచన: పరుచూరి బ్రదర్స్, సంగీతం: పార్థు, నిర్మాతలు: గంగాధర్‌రెడ్డి.కె., సేగు రమేష్‌బాబు.


Click it and Unblock the Notifications











