'నేను చాలా వరస్ట్' అంటున్న ఎన్టీఆర్
దర్శకుడు వెంకట్ పంపన మాట్లాడుతూ "మనిషి అంతర్ముఖాన్ని ఆవిష్కరించే కథ ఇది. ఇప్పటవరకూ వచ్చిన యమ నేపథ్య చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. నరకానికి వచ్చిన హీరోని యమధర్మరాజే స్వయంగా మళ్ళీ భూలోకానికి పంపిస్తాడు. అది ఎందుకనేది చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది'' అని చెప్పారు.
నిర్మాత మాట్లాడుతూ "హైదరాబాద్‌లోని రామకృష్ణ స్టూడియోలో వేసిన యమలోకం సెట్‌లో పది రోజులు చిత్రీకరించాం. తారకరత్న తదితరులపై కీలక సన్నివేశాలు, ఒక పాట తీశాం. ఈ నెల 22 నుంచి వైజాగ్‌లో షెడ్యూల్ జరుగుతోంది. ఇందులో మొత్తం ఆరు పాటలున్నాయి'' అని తెలిపారు.
భానుప్రియ, మురళీమోహన్, జయప్రకాష్‌రెడ్డి, రఘు, తెలంగాణ శకుంతల, రాజీవ్ కనకాల, అజయ్, ప్రభాస్ శ్రీను తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: ఈశ్వర్, సంగీతం: పార్థసారథి, సమర్పణ: లక్ష్మీ మల్లాగౌడ్, సహ నిర్మాత: నరేష్ గౌడ్, నిర్వహణ: ఎస్.మధు.


Click it and Unblock the Notifications












