అదీ 'వెంకటాద్రి' పొజీషన్

By Staff

Tarakaratna
వెంకటాద్రి సినిమాతో తారకరత్నకు మరో ఫ్లాఫు రత్న అవార్డు వరించింది. సముద్ర తన మల్లె పూవు చిత్రం అనంతరం రూపొందించిన ఈ చిత్రం అలనాటి బాలకృష్ణ నరసింహనాయుడు ని గుర్తు చేస్తూ రంగంలోకి దూకింది. ఈ చిత్రంలో వెంకటాద్రి నాయుడు ఉరిశిక్ష పడ్డ ఖైది. అతను ప్రారంభంలో జైల్లో ఉంటాడు. అతను గొప్ప సంగీతకారుడని అతని చివరి కోరికగా సంగీత సభ ఏర్పాటు చేస్తారు. ఆ డబ్బుని అనాధాశ్రయాలకి విరాళమిస్తానని చెప్తాడు. ఇక అతని గానామృతం విన్న ముఖ్యమంత్రి కూతురు ప్రేమలో పడి అతని వద్దకు సంగీతం నేర్చుకోవటానికి బయిలుదేరుతుంది. అంతటితో ఆగక నీ గతమేమిటని ప్రశ్నిస్తుంది. దాంతో ఎప్పుడు చెపుదామా ఫ్లాష్ బ్యాక్ అని ఎదురుచూస్తుట్లున్న వెంకటాద్రి ఆ ముడి విప్పేస్తాడు.

ఆ ప్లాష్ బ్యాక్ లో అతనికో సోదరి(రిధిమ). అతని పంచప్రాణాలన్నీ ఆమె మీదే. అయితే ఆమె వల్లే అతనికి కష్టాలు వస్తాయి. ఆమె విలన్ (ధర్టీ ఇయిర్స్ ఇండస్ట్రీ పృధ్వీ)తమ్ముడ్ని ప్రేమిస్తుంది. ఆమె తండ్రి ఒప్పుకోకపోయినా తమ్ముడు వెంకటాద్రి సాయింతో (వాళ్ళు మా యింటిలో వెంకటాద్రి పాలేరుగా చేయాలి,అతని ఆస్ధి మొత్తం దానం చేయాలి వంటి దిక్కుమాలిన కండీషన్స్ పెడతారు) పెళ్ళి చేసుకుంటుంది. అయితే కొంతకాలం అయ్యాక ఆ విలన్స్ తన ఫ్యామిలీని లేపేయటానికి ప్లాన్ చేస్తున్నారని తెలుసుకుని వచ్చి చెపుదామని బయిలు దేరుతుంది. ఇది తెలుసుకున్న ఆమెను వాళ్ళు చంపేస్తారు. అప్పుడు తమ్ముడు వెంకటాద్రి రెచ్చిపోయి ఎలా పగతీర్చుకుని,మారణహోమం సృష్టించాడన్నది ఫ్లాష్ బ్యాక్.

ఇక ఫ్యాష్ బ్యాక్ అనంతరం ప్రేమిస్తున్న ముఖ్యమంత్రి..జనాల దగ్గర సంతకాలు పోగుచేసి రాష్ట్రపతి క్షమాబిక్ష సంపాదించి విడిపిస్తుంది. అప్పుడు హోం మినిస్టర్ కొడుకు ఆమెను పెళ్ళి చేసుకుందామని అడ్డుపడతాడు వెంకటాద్రికి. అలా కథ ఓ దారి తెన్నూ లేకుండా ముందుకు వెళ్తూ...తమ బాబాయి,తన సోదరుడు చేసిన సినిమాల్లోని సన్నివేశాలను కలుపుకుంటూ నడుస్తుంది. ఇక సముద్ర ఈ సినిమా టేకింగ్..తన గత చిత్రం మల్లెపూవుని మించిపోయి నీచంగా తీసాడు. ఇలా కథ,కథనాలు చెత్తగా ఉన్న ఈ సినిమా ఓపినింగ్స్ కూడా సంపాదించుకోకపోవటం విషాదం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X