తొడ కొట్టక తప్పదా తారకరత్నా?

By Staff

Tarakaratna
అని దీనంగా అంటున్నారు నందమూరి అభిమానులు. ఏదో ఒక సారి ఆవేశంలోనో ఉషారులోనో తొడ గొట్టాడంటే అర్ధం ఉంది. కానీ మీటింగ్ కని వెళ్ళిన ప్రతీసారీ ప్రతీ చోట ఇలా తొడ వాచేలా కొట్టుకోవాలా ..ఇది చూసి మిగతా పార్టీలు వాళ్ళు కామెంట్స్ చేస్తున్నారు. కాస్త వినిపించుకుంటే బాగుంటుందని ఆవేదన వెళ్ళబుచ్చుతున్నారు..ఆ మీటింగ్ లకు అటెండయిన వారు.


పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా ఏలూరులో జరిగిన ఓ సభలో తారకరత్న నందమూరి వంశ అంటూ తొడగొట్టాడు. అంతే గాక మళ్ళీ వెంటనే మరో వైపుకి తిరిగి మీరూ చూస్తారా అంటూ మళ్ళీ తొడ గొట్టాడు. ఇది చూసిన వారు రాజకీయ పరమైన చైతన్యం తెచ్చేందుకు వెళ్ళి ఈ తొడగొట్టుడు ప్రదర్శన పెడుతున్నాడేంటి అంటూ చర్చించుకుంటున్నారు.

అందులోనూ తెలుగుదేశం అధ్యక్ష్యుడు చంద్రబాబు నాయుడు గురించి ఒక్క ముక్క కూడా మాట్లాడకపోవటం జరుగుతోంది. ఇప్పటికీ బాబాయ్ అంటూ బాలకృష్ణ గురించే ఎంతసేపూ చెప్తున్నాడు. తనకి బాబాయే ఆదర్శమని,తెలుగుదేశం పార్టీకి బాలయ్యే అసలు వారసుడని చెప్తున్నాడు.ఇది బాలకృష్ణకు కూడా తలనొప్పి తెచ్చి పెట్టే అవకాశముందని విశ్లేషకులు అంటున్నారు. నిద్రపోతున్న సింహాన్ని నిద్ర లేపారు. ఇక రాజకీయ పార్టీలకు కునుకు ఉండదు.

నా దైవం బాలకృష్ణ అనీ ,గాడ్ పాధర్ ఎన్టీఆర్ అని చెప్పుకొచ్చాస్తున్నాడు.కాస్త స్టేజీపై ఏం మాట్లాడాలో ఎక్కడ తొడకొట్టాలో ఏ విషయం హైలెట్ చేయాలో ముందే ఆలోచించుకుని చేయటం మంచిదని అంతా సూచిస్తున్నారు. లేకపోతే అందరిలో నవ్వులపాలవటం తప్ప పెద్ద గా ఎవరికీ ఉపయోగపడేదేమీ ఉండదని విశ్లేషకులు అంటున్నారు. అయినా సినిమా నటులు ప్రజల్లోకి వెళ్ళినా నటన తప్పదా...

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X