నందమూరి హీరో విజేత అయ్యేనా?
హైదరాబాద్: నందమూరి హీరో తారకరత్న, శ్వేత బసు, రచన మౌర్య హీరో హీరోయిన్లుగా వి.యం.సి కంబైన్స్ పతాకంపై పి. ఉదయభాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'విజేత'. ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో ఓ యువకుడు ఎలా విజేతగా నిలిచాడు అనే పాయింట్ తో ఈ చిత్రం రూపొందుతోంది. మరి ఇప్పటి వరకు కెరీర్లో విజయవంతమై సినిమాలేని తారక రత్న ఈ చిత్రంతోనైనా విజేత అనిపించుకుంటాడో లేదో..?
వి. దొరస్వామి రాజు సమర్పణలో తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న ఈచిత్రం కోసం ఇటీవల రెండు పాటలను తారకరత్న, రచనా మౌర్యలపై వైజాగ్, అరకులలో చిత్రీకరించడంతో షూటింగ్ పార్ట్ ముగిసింది. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు శర వేగంగా జరుగుతున్నాయి. ఈ విషయాన్ని నిర్మాత రామ సత్యనారాయణ తెలియజేస్తూ, ఎడిటింగ్, డబ్బింగ్ పూర్తయిందని, రీరికార్డింగ్ మొదలు పెడుతున్నామని అన్నారు. మిగిలిన పనులను త్వరితగతిన పూర్తి చేసి, డిసెంబర్లో చిత్రాన్ని విడుదల చేస్తామని ఆయన చెప్పారు. చిత్ర సమర్పకుడు దొరస్వామి రాజు మాట్లాడుతూ, కథకు ప్రాధాన్యమిచ్చి చేస్తున్న చిత్రమిదని పేర్కొన్నారు. ఇంత వరకు చేయని విభిన్నమైన పాత్ర ఇందులో పోషించానని హీరో తారకరత్న వెల్లడించారు.
ఇంకా ఈ చిత్రంలో కృష్ణుడు, అశోక్ కుమార్, వైజాగ్ ప్రసాద్, సన, చంటి, జెన్ని తదితరులు తారాగణం, ఈ చిత్రానికి సంగీతం: అర్జున్, ఛాయా గ్రహణం: శివరాంరెడ్డి, ఆర్ట్: విజయకృష్ణ, ప్రొ.కంట్రోలర్: పి.వి.శాస్త్రి, సమర్పణ: వి.దొరస్వామి రాజు, నిర్మాత: తుమ్మలపల్లి రామసత్యనారాయణ, కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఉదయ్ భాస్కర్.


Click it and Unblock the Notifications












