twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తిరగబడ్డ తారకరత్న(నందీశ్వరుడు ప్రివ్యూ)

    By Srikanya
    |

    nandeeswarudu
    సంక్రాంతి కానుకగా ఈ సంవత్సరం తారకరత్న కొత్త చిత్రం నందీశ్వరుడు ఈ రోజు విడుదల అవుతోంది. చిత్రంలో నందుగా పవర్ ఫుల్ రోల్ ని చేసారు తారకరత్న. కన్నడ చిత్రం డెడ్లీసోమ ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో తారకరత్న నందుగా కనిపిస్తారు. కథ ప్రకారం..ఉన్నత లక్ష్యాలతో కళాశాలలోకి అడుగుపెడతాడు నందు (తారకరత్న). రేడియో జాకీ ప్రగతి (షీనా)తో ప్రేమలోపడతాడు. సంతోషంగా సాగిపోతున్న అతని జీవితంలో అనుకోని సంఘటనలు చోటుచేసుకొంటాయి. దాంతో తన చుట్టూ జరుగుతున్న అన్యాయాలపై తిరగబడతాడు. అతన్ని అంతమొందించడానికి కొంతమంది రాజకీయ నాయకులు, గూండాలు కలిసి పోలీస్‌ అధికారి ఈశ్వర ప్రసాద్‌ (జగపతిబాబు)ని అతనిపైకి ఉసిగొల్పుతారు. ఆ తర్వాత ఏమైందనేది అసలు కథ. ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ ''తారకరత్న, జగపతిబాబు మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతాయి. పరుచూరి బ్రదర్స్‌ రాసిన సంభాషణలు కథకు బలాన్నిచ్చాయని అన్నారు.

    సంస్థ: ఎస్‌ఆర్‌బి ఆర్ట్స్‌ ప్రొడక్షన్స్‌ అండ్‌ కె.ఎఫ్‌.సి
    నటీనటులు: తారకరత్న, జగపతిబాబు, షీనా, సుమన్‌, అజయ్‌, రాజీవ్‌ కనకాల, నాగినీడు, ఎమ్మెస్‌నారాయణ, సీత తదితరులు.
    నిర్మాత: కోట గంగాధర్‌రెడ్డి, సేగు రమేష్‌బాబు
    దర్శకుడు: శ్రీను యరజాల
    విడుదల: ఆదివారం.

    English summary
    Tarak Ratna's Nandeeswarudu film relesing today with a bang.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X