»   » సూర్య ‘24’మూవీ ఎలా ఉందంటే.. (తరణ్ ఆదర్శ్ రివ్యూ!)

సూర్య ‘24’మూవీ ఎలా ఉందంటే.. (తరణ్ ఆదర్శ్ రివ్యూ!)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సూర్య హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో, ఆస్కార్ అవార్డు విన్నర్ ఎ.ఆర్.రెహమాన్ సంగీత సారధ్యంలో రూపొందుతోన్న సైన్ ఫిక్షన్ థ్రిల్లర్ '24'. ఈ చిత్రాన్ని గ్లోబల్ సినిమాస్, 2డి ఎంటర్ టైన్ మెంట్స్, శ్రేష్ట్ మూవీస్ కలయికలో స్టూడియో గ్రీన్ అధినేత కె.ఇ.జ్ఞానవేల్ రాజా సమర్పణలో మే 6న రిలీజవుతోంది. సినిమాను తమిళనాడు, ఏపీ, తెలంగాణ, కర్నాటక, కేరళ రాష్ట్రాలతో పాటు ఉత్తరాదిన, ఓవర్సీస్‌లో భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు.

'మనం' లాంటి హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు కావడం....ఈ సినిమాకు సూర్యనే నిర్మాత కావడంతో సినిమాపై మరింత అంచనాలు పెరిగాయి. సూర్య కెరీర్లోనే ఇదో అద్భుతమైన చిత్రం అవుతుందని ముందు నుండి అంచనా వేస్తున్నారు. ఇపుడు అదే నిజమయ్యేట్లు కనిపిస్తోంది.

కొన్ని చోట్ల ఈ రోజే స్పెషల్ షోలు వేసారు. ప్రముఖ బాలీవుడ్ సినీ విమర్శకుడు, మూవీ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్..... '24' ప్రివ్యూ షో చూసి సినిమాపై ప్రశంసల వర్షం కురపించారు. ఆయన చెప్పిన విషయాలను బట్టి '24' చిత్రం సూపర్ హిట్ సినిమా అని స్పష్టమవుతోంది.

24 లాంటి సినిమా తీయాలంటే ఎంతో ధైర్యం.. నిబద్ధత.. సినిమాపై పట్టు ఉండాలి. అలాగే ఆర్థికంగానూ ఎంతో అండ ఉండాలి. 24 సినిమా టైటిల్స్ దగ్గర్నుంచే మీ దృష్టిని ఆకర్షిస్తుంది. 2 గంటల 40 నిమిషాల పాటు ఈ సినిమాకు అంకితమైపోతారు. టెర్రిఫిక్ రోలర్ కాస్టర్ రైడ్ లా ఉంటుంది. కాన్సెప్టే 24 సినిమాకు ప్రధాన ఆకర్షణ. ఊహకందని ట్విస్టులు.. అపరిమితమైన వినోదం.. మిమ్మల్ని కట్టిపడేస్తాయి అంటూ ఆయన ట్వీట్స్ చేసారు.

స్లైడ్ షోలో తరణ్ ఆదర్శ్ ఈ సినిమా గురించి ఇంకా ఏం ట్వీట్స్ చేసారో చూద్దాం....

24 సినిమా గురించి తరణ్ ఆదర్శ్ ట్వీట్

24 సినిమా గురించి తరణ్ ఆదర్శ్ ట్వీట్


24 లాంటి సినిమా తీయాలంటే ఎంతో ధైర్యం.. నిబద్ధత.. సినిమాపై పట్టు ఉండాలి. అలాగే ఆర్థికంగానూ ఎంతో అండ ఉండాలి అంటూ తరణ్ ట్వీట్.

2.40 గంటలు

2.40 గంటలు


24 సినిమా టైటిల్స్ దగ్గర్నుంచే మీ దృష్టిని ఆకర్షిస్తుంది. 2 గంటల 40 నిమిషాల పాటు ఈ సినిమాకు అంకితమైపోతారు. టెర్రిఫిక్ రోలర్ కాస్టర్ రైడ్ లా ఉంటుంది అంటూ ట్వీట్ చేసారు.

ఎంటర్టెన్మెంట్స్ కూడా..

ఎంటర్టెన్మెంట్స్ కూడా..


ఈ సినిమాకు ప్రధాన కాన్సెప్టే... ఊహకందని ట్విస్టులు.. అపరిమితమైన వినోదం.. మిమ్మల్ని కట్టిపడేస్తాయి అని ట్వీట్ చేసారు.

హైలెట్స్

హైలెట్స్


నాటకీయ ఆరంభం.. సూర్య-సమంత మధ్య వచ్చే క్యూట్ లైట్ మూమెంట్స్.. అద్భుతమైన ఇంటర్వెల్ పాయింట్.. ఎమోషనల్ సన్నివేశాలు.. పతాక సన్నివేశం.. ఈ సినిమాకు హైలెట్స్ అని ట్వీట్ చేసారు.

దర్శకుడిపై..

దర్శకుడిపై..


మనం సినిమాను అద్భుతంగా మలిచిన విక్రమ్ కుమార్.. మరోసారి తన మాస్టర్ క్లాస్ చూపించాడు, 24 సబ్జెక్ట్ ను గొప్పగా డీల్ చేశాడు అని తరణ్ ఆదర్శ్ ప్రశంసించారు.

సూర్య ట్రిపుల్ రోల్

సూర్య ట్రిపుల్ రోల్


మూడు భిన్నమైన పాత్రలు పోషించిన సూర్య అవార్డు విన్నింగ్ పెర్ఫామెన్స్ ఇచ్చాడు. ముఖ్యంగా అతను విలన్ పాత్రలో అదరగొట్టాడు అని తరణ్ అన్నాడు.

సినిమా అద్భుతం

సినిమా అద్భుతం


తరణ్ ఆదర్శ్ ట్వీట్స్ బట్టి ఈ సినిమా అద్భుతం అని తేలిపోయింది అంటున్నారు ఫ్యాన్స్.

English summary
"It requires courage, conviction, command over the medium and of course, financial strength to bring to life a film like 24 Movie. TheMovie grabs your attention from the titles itself and for the next 2.40 hours you're hooked on to this terrific roller coaster ride. Biggest strength of 24 The Movie is its concept. It also packs loads of entertainment and unpredictable twists and turns that win you over." Taran Adarsh tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu