twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'టార్గెట్' మిస్ (మినీ రివ్యూ)

    By Staff
    |

    Target
    చాలా కాలంగా బిజెనెస్ కాక ఆగిన ముమైత్ టార్గెట్ ఎట్టకేలకు రిలీజైంది. అయితే తన టార్గెట్ ప్రేక్షకులను తృప్తిపరచలేక టార్గెట్ మిస్ చేసుకుంది. రివెంజ్ ఫార్మెట్ తో వచ్చిన ఈ సినిమా వెళ్ళిన కొద్దిమంది ప్రేక్షకులపై రివెంజ్ తీర్చుకున్నట్లు అయింది. బేసిక్ ఇనిస్టెంట్ చిత్రాన్ని మక్కికి మక్కి కాపీ చేసిన ఈ చిత్రంలో కథ, కథనాలు బోర్ కొట్టడమే కాక పాత్రధారులు సైతం ఏ మాత్రం ఉషారు లేకుండా నటిస్తూ నస పెడతారు.

    మందాకిని(ముమైత్)ఓ పేరున్న నవలా రచయిత్రి(అసలు ఈ రోజుల్లో నవలలు తీరిగ్గా చదివేవారు ఎవరు...అంత పేరుతెచ్చుకుంటున్న రచయితలు ఎవరు ఉంటున్నారు).ఆమెను ఓ పేరున్న బాక్సర్ హత్య కేసులో అనుమానిస్తారు. పోలీసులు సైతం ఈ కేసులో విక్టిమ్స్ గా మారటంతో ఏసీఫీ బోస్ (శివబాలాజీ)రంగంలోకి దూకుతాడు. లై డిటెక్టర్ సైతం మందాకినిను హంతకురాలుగా ప్రూవ్ చేయలేకపోయినా అతని అనుమానం తీరక తీరిగ్గా అనుమానిస్తూ ఇంట్రాగేట్ చేస్తూంటాడు.ఈలోగా పోస్ట్ మార్టమ్ లో ఆ బాక్సర్ మర్మకళ(భారతీయుడు తరహా)తో చనిపోయినట్లు గమనిస్తాడు. ఇంతకీ ఆ మందాకిని ఎవరు..ఆ హత్యలకీ ఆమెకీ ఏంటి సంభందం. ఆమే చేస్తే అలాంటి అవసరం ఏమొచ్చింది..అనేది మిగతా కథ..

    మైసమ్మ,పున్నమినాగు,మంగతాయారు టిఫిన్ సెంటర్,భజంత్రీలు వంటి డిజాస్టర్స్ తర్వాత కూడా ముమైత్ గ్లామర్ తో సినిమా మొత్తాన్ని నడిపించాలనుకునే దర్శక,నిర్మాతల ఆలచనలుకు గండిపడినట్లు లేదని ఈ చిత్రం రిలీజ్ తో అర్ధం అవుతుంది. ఇక కథే మరీ పాత కాలంలో ఉండటం,దాన్ని డీల్ చేయటం కూడా పాత పద్దతుల్లోనే చేయటం ఈ చిత్రానికి పెద్ద మైనస్. సాధారణంగా పాత కథలు ఎన్నుకున్నప్పుడు దర్శకులు కొత్త పద్దతిలో ఆ చిత్రాన్ని ప్రెజెంట్ చేయటానికి ప్రయత్నిస్తూంటారు. అలా ఈ రోజు పెద్ద దర్శకులు అనుకుంటున్నవారందరూ అలాగే పాత పాయింట్లతో గెలుస్తున్నవారే నన్నది తెలిసిందే. ఇక దర్శకుడు కూడా ప్రతీ సన్నివేశం ఏదో ఒక సినిమా రిఫెరెన్స్ తీసుకున్నట్లు స్పష్టంగా తెలిసిపోతుంది. పోనీ కాస్సేపు నవ్వుకుందామంటే కృష్ణభగవాన్ హాస్యం పెద్దగా పండలేదు. వేణుమాధవ్ ,కొండవలస హాస్యం కొద్దిలో కొద్ది బెటర్. జీవా ఇన్సూరెన్స్ ఎపిసోడ్ ఫరావాలేనిపిస్తుంది. సంగీతం కూడా ఇంప్రెసివ్ గా లేదు .నటనలో ముమైత్ ఖాన్ పెద్దగా చేసిందేమీ లేదు. ఆమె ఎక్సపోజింగ్ ని అనేకమార్లు తెరపై చూసి ఉన్నవారికి పెద్దగా కిక్కు ఇవ్వదు. ఇక శివబాలాజి ..పోలీస్ ఆఫీసర్ గా ఏమీ నప్పలేదు.

    ఇక లెంగ్త్ తక్కువుగా ఉన్న ఈ సినిమా మరీ 1992 నాటి పాయింట్ ని కాకుండా లేటెస్ట్ ది ఎత్తుకుని ఉన్నా బాగుండును అనిపిస్తుంది. అందులోనూ సంచలనం సృష్టించిన 'బేసిక్ ఇనిస్టెంట్' ని చూసిన వారే ఎక్కువ కావటం ఈ చిత్రానికి మరో మైనస్. స్క్రిప్టు మరింత బాగా చేసుకుని, కొత్తతరహా కథనంతో,నవలా రచయిత్రి వంటి వృత్తులు తీసేస్తే బాగుండేది అనిపిస్తుంది. ఏదైమైనా బి, సి సెంటర్లను టార్గెట్ చేసిన ఈ చిత్రం అక్కడ కూడా అలరించటం కష్టమే.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X