తరుణ్ ఇప్పుడు ఏం చేస్తున్నాడు?
నువ్వే కావాలి చిత్రంలో ఒక్కసారిగా ఓవర్ నైట్ లవర్ బోయ్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న నటుడు తరుణ్. ఆ తర్వాత అతను చేసిన సినిమాలేవీ పెద్దగా ఆడలేదు. దాంతో చేతిలో సినిమాలు సంఖ్య కూడా మెల్లిగా తగ్గుకుటూ వచ్చేసింది. అయితే తను మాత్రం ఫుల్ బిజీ అంటున్నారు తరుణ్. ఆయన తాజాగా మీడియాతో మాట్లాడుతూ...గత మూడు రోజులుగా 'అనుచరుడు' యాక్షన్ సీన్స్ చేస్తున్నాను. ఈ చిత్రంలో ఎక్కువ యాక్షన్ సీన్స్ ఉన్నాయి. మూడు పాటలు మినహా ఈ సినిమా పూర్తయ్యింది. ఫిబ్రవరిలో ఈ చిత్రం విడుదలవుతుంది. 'యుద్ధం' షూటింగ్ కూడా జరుగుతోంది'' అన్నారు.
ఇక ఆయన్ని ఏంటి అన్నీ యాక్షన్ సినిమాలే చేస్తున్నారు...లవర్‌బోయ్ ఇమేజ్ నుంచి బయటికి రావాలనే ఆలోచనతోనే ఈ యాక్షన్ చిత్రాలు ఓకే చేసారా అని అడిగితే దానికి తరుణ్ స్పందిస్తూ..''ఏ ఆర్టిస్ట్‌కైనా ఓ ఇమేజ్ రావడం అనేది గొప్ప విషయం. అందుకే నా ఇమేజ్‌ని నేను వదులుకోవాలనుకోవడంలేదు. నా ఇమేజ్‌కి తగ్గ కథలోనే యాక్షన్, ఇతర అంశాలు ఉండేట్లు చూసుకుంటున్నాను'' అని చెప్పారు తరుణ్. ప్రస్తుతం అనుచరుడు, యుద్ధం చిత్రాల్లో నటిస్తున్నారాయన. మధ్యమధ్యలో సీసీఎల్ మ్యాచ్‌లు ఆడుతున్నాడు.


Click it and Unblock the Notifications











