తరుణ్ సినిమా ఈ సారైనా రిలీజవుతుందా?
చాలా కాలం క్రితం ప్రారంభమై దర్శకులను మార్చుకుంటూ ఆగిపోయిన తరణ్ చిత్రం 'చుక్కలాంటి అమ్మాయి...చక్కనైన అబ్బాయి'. సలామ్ నమస్తే చిత్రానికి కాపీగా తయారైన ఈ చిత్రం అంతా ఆగిపోయిందనుకున్న తరుణంలో త్వరలో విడుదల చేస్తున్నామంటూ నిర్మాత మీడియాకు తెలియచేసారు. తరుణ్, శ్రీకాంత్ కాంబినేషన్ లో అనుచరుడు చిత్రం ప్రారంభం కావటంతో మళ్ళీ తరుణ్ కి మార్కెట్ వచ్చిందని భావించి ఈ చిత్రం విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది..ఈ సందర్భంగా నిర్మాత శ్రీనివాస్ మాట్లాడుతూ "విదేశీ నేపథ్యంలో కథ నడుస్తుంది. నేటి యువతకు ప్రేమ, పెళ్లి అనే విషయాలపై ఉన్న అవగాహన, అభిప్రాయాల్ని చూపించే ప్రయత్నమిది. తరుణ్ పాత్ర ఇప్పటి కుర్రాళ్లకు దగ్గరగా ఉంటుంది. చుక్కలాంటి చిన్నదానితో అతగాడు ఏం చేశాడన్నది తెర మీద చూస్తేనే బాగుంటుంది. అనూప్ అందించిన స్వరాలు కథకు బలాన్నిచ్చాయి. ఈ నెలలోనే చిత్రాన్ని కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామ"న్నారు. ఇద్దరు దర్శకులు మారి ఫైనల్ గా కన్మణి దర్శకత్వం పేరుతో వస్తున్న ఈ చిత్రానికి రాజు హిర్వాణి, గోగినేని శ్రీనివాస్ నిర్మాతలు. గాయం-2 చిత్రంలో చేసిన విమల రామన్ ఈ చిత్రంలో హీరోయిన్ గా చేసింది.


Click it and Unblock the Notifications











