పెళ్ళికి ముందే ఒకరి అభిరుచులు మరొకరు తెలుసుకోవాలి...తరుణ్
'పెళ్లి అయిన తరవాత ఒకరినొకరు అర్థం చేసుకోవడం కంటే కూడా ప్రేమించి అభిరుచులు తెలుసుకోవడం మంచిది. దాని వలన నూరేళ్ల ప్రేమ మూణ్నాళ్ల ముచ్చట కాదని తెలుస్తుంది అంటున్నారు తరణ్.ఆయన హారోగా రూపొందిన 'చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి' చిత్రం ఆడియో త్వరలో విడదల కాబోతోంది. ఈ సందర్భంగా మీడియాతో సమావేశం ఏర్పాటు చేసారు. ఇక దర్శకుడు కణ్మణి మాట్లాడుతూ...
ప్రేమికులు తమ ప్రేమను గెలిపించుకోవాలంటే ముందు పెద్దలను ఒప్పించాలి. చాలా ప్రేమ కథలకి ఇదే పెద్ద అడ్డంకి. ఇక్కడ ఓ యువ జంట ప్రేమను అందరూ అంగీకరించారు. కానీ వాళ్ల ప్రేమకు వారే సమస్య అయ్యారు.అదే మా చిత్ర కథ అంటున్నారాయన. ఇక ఈ చిత్రంలోని ఎక్కవ భాగం బ్యాంకాక్ లో చిత్రీకరించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది.అనూప్స్ రూబెన్స్ సంగీతం అందించిన పాటల్ని..జనవరి నెలాఖరున పాటల్ని విడుదల చేస్తున్నారు. తరుణ్ సరసన విమలా రామన్ నటించిన ఈ చిత్రాన్ని రాజ్ కుమార్ హర్వాణి, గోగినేని శ్రీనివాసరావు సంయుక్తంగా నిర్మించారు. ఇక ఈ చిత్రం బాలీవుడ్ హిట్ సలామ్ నమస్తే చిత్రానికి కాపీగా తయారైన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











