'సుప్రీం' హీరో... తరుణ్

By Staff

Tarun
ఇదేం తరుణ్ కిచ్చిన కొత్త బిరుదేం కాదు. అతను...కొత్తగా కమిటయ్యిన ఓ సినిమా గురించి అంతా అలా అంటున్నారు. తరుణ్ సెకెండ్ ఇన్నింగ్స్ బాగానే సాగుతోంది. కొత్త కొత్త ఆఫర్లు,క్రేజీ ప్రాజెక్టులతో ముందుకు దూసుకుపోతున్నాడు. తాజాగా అతను సుప్రీం ఆడియో వారు తియ్యనున్న చిత్రానికి హీరోగా ఎంపికయ్యాడు. ఆ మధ్య సుప్రీమ్ ఆడియోస్ మోహన్ బాబు కుమారుడు విష్ణ వర్ధన్ హీరోగా సురేష్ కృష్ణ దర్శకత్వంలో 'అస్త్రం' సినిమాను రూపొందించారు.

బాలీవుడ్ సూపర్ హిట్ 'సర్ఫరోష్' కి కాపీగా వచ్చిన ఆ సినిమా డిజాస్టర్ గా భాక్సాఫిస్ వద్ద మిగిలింది. దాంతో వరసగా సినిమాలు తీద్దామనుకున్న సుప్రీమ్ వారు ఆగారు. మళ్ళీ ఇప్పుడు తరుణ్ తో రంగంలోకి దిగుతున్నారు. ఇక 'ఓ చినదానా' వంటి కామిడీలను అందించి ఈ మధ్య కాస్త వెనుకపడ్డ ఇ.సత్తిబాబు దీనికి దర్శకుడు. 'భలే దొంగలు' తో తిరిగి ఎంట్రీ ఇచ్చిన తరుణ్ ప్రస్తుతం కృష్ణ వంశి దర్శకత్వంలో 'జర్నీ' అనే సినిమాను చేస్తున్నాడు. ఇక ఈ కొత్త సినిమా పూర్తి స్ధాయి ఎంటర్ టైన్ మెంట్ తో నవ్విస్తుందని చెపుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X