కృష్ణవంశి సినిమాలో చేయటం కెరీర్ లో వెనుకపడిపోయిన తరుణ్ కి బాగా కలిసి వచ్చినట్లుంది. వరసలో ఆఫర్స్ వస్తున్నాయి.తాజాగా సుప్రీం రాజు హీర్వానీ తన మిత్రుడు గోగినేని శ్రినివాస్ తో కలిసి రూపొందించనున్న చిత్రంలో అతన్ని తీసుకున్నారు. గతంలో సుమంత్ తో పౌరుడు చిత్రాన్ని డైరక్ట్ చేసిన ఆదిత్య రాజ్ ఈ చిత్రాన్ని డైరక్ట్ చేయనున్నాడు. మొదట ఈ చిత్రాన్ని కామెడీ చిత్రాల దర్శకుడు ఇ.సత్తిబాబు డైరక్ట్ చేస్తాడనే వార్తలు వచ్చాయి. అయితే ఎందుకనో ఆ ప్రాజెక్టు ప్రక్కకు వెళ్ళి ఆదిత్య తెరపైకి వచ్చారు. ఇక తరుణ్ కూడా ఈ చిత్రం చేయటంపై హ్యాపీగా ఉన్నాడు.జనవరిలో ప్రారంభమయ్యే ఈ సినిమా సమ్మర్ రిలీజ్ గా ప్లాన్ చేస్తున్నారు. హీరోయిన్ మరియు ఇతర తారాగణం ఫైనలైజ్ కావాల్సి ఉంది.