కృష్ణ వంశి కొత్త సినిమా 'జర్ని'

అందులో హీరోయిన్ కోటీశ్వురుడు కూతురు. ఆమె ఇష్టం లేని పెళ్ళి తప్పించుకోవటానికి... ఓ సినిమా స్టార్ ని కలవటానికి ఇంటిలో నుంచి పారిపోతుంది. అలాగే హీరో కూడా రిపోర్టర్ ఉద్యోగం చేస్తూంటాడు. మంచి న్యూస్ స్కూప్ కోసం వెతుకుతూ ప్రయాణం కడుతాడు. ఇద్దరూ బస్సులో కలుస్తారు. అక్కడ నుండి వీరిద్దరి రొమాంటిక్ జర్ని ప్రారంభమవుతుంది. మరో ప్రక్క ఆమె తండ్రి పంపిన మనుష్యులు అంతటా వెతుకుతూ ఉంటారు. ఆమె తప్పి పోయిందని బహుమతి ప్రకటిస్తాడు.దాంతో చాలా మంది ఆమెని గుర్తు పట్టి వెనుకపడతారు. వీరందరని తప్పించుకుని వీరిద్దరూ ఎలా ఒకటయ్యారనేది సరదా కథ. గతంలో కూడా కృష్ణ వంశి 'హమ్ ఆప్ కి హై కౌన్' ప్రేరణతో 'నిన్నే పెళ్ళాడతా' ,మ్యాచిస్ ప్రేరణతో 'సింధూరం' ,' విత్ అవుట్ మై డాటర్' ప్రేరణతో 'అంతఃపురం' తీసారు. దాంతో ఈ చిత్రాన్నికృష్ణవంశి ఎలా మారుస్తారో అని పరిశ్రమలో వాళ్ళు ఎదురుచూస్తున్నారు. అలాగే 'భలేదొంగలు' తరువాత తరుణ్ మరో హిందీ చిత్రం ఫ్రీమేక్ లో కనిపించబోతున్నాడు.


Click it and Unblock the Notifications











